Prajavani Candy Crush : ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు లైట్ తీసుకుంటున్నారు. కొందరు మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుకుంటుంటే, మరికొందరు నిద్రలోకి జారుకుంటున్నారు. ఇంకొందరు సినిమాలు, వాట్సాప్ మేసేజ్ లను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు మొరపెట్టుకుంటుంటే అధికారులేమో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ ఆటలు ఆడుకోవడం విమర్శలకు తావిస్తోంది. వారి ఆశలను అధికారులు వమ్ము చేస్తున్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ సీరియస్ అయ్యారు. ప్రజావాణిలో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ కాలక్షేపం చేసిన మెడికల్ ఆఫీసర్ శిరీషను సంగారెడ్డి నుంచి సదాశివపేటకు బదిలీ చేశారు. ఇవాళ కొందరు అధికారులకు కలెక్టర్ శరత వార్నింగ్ ఇచ్చారు.