Raju Safe: రాజు సేఫ్.. బండరాళ్ల మధ్యనుంచి సురక్షితంగా బయటకు.. ఫలించిన అధికారుల కృషి

అడవిలో వేటకోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన రాజు క్షేమంగా బయటకు వచ్చాడు. దాదాపు 42 గంటలపాటు నరకయాతన అనుభవించిన రాజును రెస్క్యూ ఆపరేషన్ తో అధికారులు బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించడంతో స్వల్ప గాయాలతో రాజును బయటకు తీసుకురాగలిగారు.

Raju Safe: అడవిలో వేటకోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన రాజు క్షేమంగా బయటకు వచ్చాడు. దాదాపు 42 గంటలపాటు నరకయాతన అనుభవించిన రాజును రెస్క్యూ ఆపరేషన్ తో అధికారులు బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించడంతో స్వల్ప గాయాలతో రాజును బయటకు తీసుకురాగలిగారు. రాజును వెంటనే అంబులెన్సులో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రాజును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించిన అధికారులు విజయవంతంగా ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు రాజు కుటుంబ సభ్యులు అధికారుల కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

Viral Video: సింహాలతో అడుకుంటున్న బాలుడు.. చెయ్యి ఎలా కొరికిందో చూడండి.. వీడియో వైరల్

కామారెడ్డి జిల్లా రెడ్డిపేటకు చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం స్నేహితుడు మహేష్ తో కలిసి వేటకు వెళ్లాడు. ఘన్‌పూర్ శివారు అడవిలో వెళ్తున్న క్రమంలో సెల్ ఫోన్ రెండు పెద్దరాళ్ల మధ్య గృహలో పడిపోయింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించే క్రమంలో రాజు రెండు రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ విషయాన్ని స్నేహితుడు రాజు కుటుంబ సభ్యులకు తెలిపాడు. కుటుంబ సభ్యులు రాజును బయటకు తీసేందుకు శతవిధాల ప్రయత్నించినప్పటికీ బయటకు రాలేదు. చివరికి బుధవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏఎస్పీ ఆధ్వర్యంలో జేబీసీల సహాయంతో బండరాళ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. జిల్లా ఏఎస్పీ అన్యోన్య, ఇన్ ఛార్జి తహసీల్దార్ సాయిలు ఆధ్వర్యంలో పోలీసులు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

Viral Video: స్టేజ్ మీదే వరుడి చెంప చెల్లుమనిపించిన వధువు.. అనంతరం ఇద్దరూ జుట్టు పట్టుకుని..

గురువారం ఉదయం రెండు జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాళ్లను తొలగించేందుకు తీవ్రంగా శ్రహించారు. ఈ క్రమంలో బ్లాస్టింగ్ లు సైతం చేశారు. దాదాపు 42 గంటల సమయంలో సుమారు 16సార్లు బండ్లరాళ్లను అధికారులు బ్లాస్టింగ్ చేశారు. రాజుకు ధైర్యం చెబుతూ, నీళ్లు, ఓఆర్ఎస్ తాగించేందుకు ప్రయత్నం చేశారు. 42 గంటల తరువాత రెస్క్యూ టీం కృషితో రాజు క్షేమంగా బయటకు వచ్చాడు. అతన్ని వెంటనే అంబులెన్స్ సహాయంతో కామారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రెండు రోజులుగా రాజుకోసం వారు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజును తీసేందుకు అధికారులు చేసిన కృషికి కుటుంబ సభ్యులు కృతజ్ఙతలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు