Madhapur Water : మాదాపూర్‌‌లో కలుషిత నీరు ఒకరు మృతి.. 45 మందికి అస్వస్థత

గత వారం రోజుల నుంచి బస్తీలో కలుషిత నీరు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మంచినీరు దుర్వాసనతో వస్తున్నాయని.. వాటిని తాగిన వారు వాంతులు, విరోచనాలు...

Madhapur Water

Contaminated Water In Madhapur : హైదారాబాద్ మాదాపూర్‌లోని గుట్టల బేగంపేట్‌లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. ఒకరు మృతి చెందడం.. 45 మంది బాధితులు ఆస్పత్రుల పాలుకావడం.. స్థానిక బస్తీ వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. మరోవైపు ప్రజల అనారోగ్యానికి జ‌ల‌మండ‌లి స‌ర‌ఫ‌రా చేస్తున్న మంచినీరు కార‌ణం కాదని జలమండలి అధికారులు స్పష్టం చేశారు. బస్తీలో సరఫరా చేసే నీటి నమూనాలు పరీక్షించగా.. నీటిలో తగు మోతాదులో క్లోరిన్‌ ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని పరీక్షల్లో తేలిందన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా జలమండలి నీరు తాగొచ్చని అధికారులు వివరించారు.

Read More : Hyd Pubs : పుడ్డింగ్ ఇన్ మింక్ పబ్ ఆదాయం ఎంతో తెలుసా ?

కలుషిత నీటి ఘటనతో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. బస్తీలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. స్థానికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు కొనసాగిస్తామని జిల్లా మెడికల్ ఆఫీసర్‌ జనార్థన్‌ తెలిపారు. ఈ పరిస్థితికి కలుషిత ఆహారం కూడా కారణమయ్యే అవకాశమందన్నారు.

Read More : Hyd : ఎర్రగడ్డలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షసులు

గత వారం రోజుల నుంచి బస్తీలో కలుషిత నీరు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మంచినీరు దుర్వాసనతో వస్తున్నాయని.. వాటిని తాగిన వారు వాంతులు, విరోచనాలు, జ్వరాలతో బాధపడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రి పాలైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉండడంతో టెన్షన్ పడుతున్నారు. నీరు మంచిగా ఉంటే.. తమ పరిస్థితికి కారణమేంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.