Hyd Pubs : పుడ్డింగ్ ఇన్ మింక్ పబ్ ఆదాయం ఎంతో తెలుసా ?

ఇందుకోసం అధికారులకు లంచాల వెర వేస్తున్నట్టు సమాచారం. వచ్చిన ఆదాయంలో కొంతభాగం లంచాలకు వెళ్తున్నట్లు తేలింది. ఇక పబ్‌లోకి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి

Hyd Pubs : పుడ్డింగ్ ఇన్ మింక్ పబ్ ఆదాయం ఎంతో తెలుసా ?

Pudding And Mink Pub

Updated On : April 9, 2022 / 7:50 AM IST

Pudding In Mink Pub : పుడ్డింగ్‌ ఇన్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ ముమ్మరం చేశారు ఖాకీలు. ఘటనపై లోతుగా విచారిస్తున్నారు. అయితే పోలీసులు విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పబ్‌లో డ్రగ్స్‌, పబ్స్‌కు వచ్చే వారి వివరాలతోపాటు.. పబ్‌ ఆదాయంపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు. దీంతో పబ్‌ ఆదాయం చూసి.. పోలీసులే అవాక్కవుతున్నారు.

Read More : Pudding and Mink Pub Drug Case : డ్రగ్స్ కేసులో నిందితుల బెయిల్, కస్టడీ పిటీషన్లపై రేపు విచారణ

పుడ్డింగ్‌ పబ్‌కు.. ప్రతినెలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడున్నర కోట్ల ఆదాయం వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజు 10 లక్షల వరకు బిజినెస్‌ జరుగుతున్నట్టు విచారణలో తేలింది. ఇక వీకెండ్‌లో అయితే ఆదాయం డబుల్‌, ట్రిపుల్‌గా మారిపోతున్నట్టు గుర్తించారు. ప్రతి వీకెండ్‌లో ఈ పబ్‌కు ఏకంగా రూ. 30 నుంచి రూ. 40 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్టు పోలీసులు తేల్చారు పుడ్డింగ్‌ పబ్‌ ఆదాయం పెంచుకునేందుకు అనేక వక్రమార్గాలను అనుసరిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వీకెండ్‌లో పబ్‌లో ఎలాంటి డిస్టబెన్స్‌ రాకుండా ముందే అన్నీ సెట్‌ చేసిపెడుతున్నట్టు తెలుస్తోంది.

Read More : Pudding And Mink Pub : ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌, బార్ లైసెన్స్ ర‌ద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

ఇందుకోసం అధికారులకు లంచాల వెర వేస్తున్నట్టు సమాచారం. వచ్చిన ఆదాయంలో కొంతభాగం లంచాలకు వెళ్తున్నట్లు తేలింది. ఇక పబ్‌లోకి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపైనా పోలీసులు కూపీ లాగుతున్నారు. అభిషేక్‌ ఉప్పల్‌కు గోవా, ముంబై వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. అనిల్‌కుమార్‌కు డ్రగ్స్‌ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్‌ తీసుకున్న 20మంది వివరాలు రాబడుతున్నారు. ఆ 20మందికి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారు ఖాకీలు.