Pudding And Mink Pub : ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌, బార్ లైసెన్స్ ర‌ద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై ఎక్సైజ్‌శాఖ చర్యలు ప్రారంభించింది. రాడిసన్‌ హోటల్‌లో పబ్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది.

Pudding And Mink Pub : ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌, బార్ లైసెన్స్ ర‌ద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

Pudding And Mink Pub

Pudding And Mink Pub :  హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై ఎక్సైజ్‌శాఖ చర్యలు ప్రారంభించింది. రాడిసన్‌ హోటల్‌లో పబ్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది. హోటల్‌ లిక్కర్‌ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. 24గంటలూ లిక్కర్‌ సప్లై చేసేందుకు రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. 56లక్షల రూపాయలు ట్యాక్స్‌ కూడా చెల్లించింది. 2బీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పేరుతో అనుమతి తీసుకుంది. పబ్‌ నిర్వహిస్తూ అడ్డగోలుగా డ్రగ్స్‌ దందా నిర్వహించారు. అడ్డంగా దొరికిపోయారు. పలువురు వీఐపీల వారసులు కూడా దొరికిపోయారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

డ్రగ్స్‌ కేసులో పట్టుబడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటున్నారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. పుడింగ్ అండ్ మింక్ వ్యవహారంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ నిర్మూల‌న‌లో భాగంగానే రాడిస‌న్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశార‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిబంధనలు పాటించని అన్ని ప‌బ్‌లు, బార్‌ల‌పై నిరంతరం దాడులను కంటిన్యూ చేస్తామని తేల్చిచెప్పారు.

డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో ఈ ఏడాది జ‌న‌వ‌రి 31న‌ హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా హోటల్‌లో సమన్వయ సమావేశం నిర్వహించామని మంత్రి గుర్తు చేశారు.
Also Read : Tamilisai Soundararajan : గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ టూర్ వెనుక కారణం ఇదేనా…!

పబ్‌ల‌లో డ్రగ్స్ వినియోగం జరగకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాలని గత సమావేశంలోనే మంత్రి హెచ్చ‌రించారు. డ్రగ్స్ వినియోగంపై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. నిబందనలు పాటించని పబ్ ఓనర్లు ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిన్నటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు.

పబ్‌లో స్వాధీనం చేసుకున్న కంటెంట్ డ్రగ్స్‌ను పోలీసులు FSL రిపోర్ట్ కోసం ల్యాబ్‌కు పంపించారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసులో సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు ఈ కేసును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్&బంజారాహిల్స్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు.