Telangana Schools: రాష్ట్రంలో ఆన్ లైన్ తరగతులకు అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో జనవరి 24 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు

Telangana Schools: తెలంగాణ రాష్ట్రంలో జనవరి 24 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర దశలో ఉన్న నేపథ్యంలో.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంక్రాంతి సెలవులను జనవరి 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీచేసింది. అయితే సిలబస్, పాఠాలు, హాజరుశాతం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ తరగతులు నిర్వహించుకునేలా పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అనుమతులు ఇచ్చింది. ఈక్రమంలో 8, 9, 10 తరగతుల వారికి సోమవారం నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని విద్యాశాఖ సంచాలకులు పేర్కొన్నారు.

Also Read: South Star Hero’s: సై అంటే సై.. తగ్గేదేలే అంటోన్న కన్నడ, తమిళ్ స్టార్స్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 50-50(రోజు విడిచి రోజు) ప్రాతిపదికన విధులకు హాజరుకావాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నిర్ములనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని బోధనేతర సిబ్బంది సైతం సగం మంది ఒకరోజు, మిగిలిన సగం మంది మరుసటి రోజు విధులకు హాజరు అయ్యేలా ప్రణాళికలు వేసుకోవాలని ఆయా పాఠశాలలకు సూచనలు జారీచేశారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను బట్టి.. జనవరి 31 తరువాత అన్ని విద్యాసంస్థలు తెరిచేలా తెలంగాణ విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేశామని, ఈ ఏడాది పరీక్షలు నిర్వహించాకే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి తెలిపారు.

Also Read: What is Surrogacy: సరోగసీ అంటే ఏమిటీ? సెలెబ్రిటీలు సరోగసీని ఎందుకు ఎంచుకుంటున్నారు?

ట్రెండింగ్ వార్తలు