Komatireddy Rajagopal Reddy : కేసీఆర్ ఓడించే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలవంతుడని, ఆయన్ను ఓడించాలంటే బలం కావాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక రేపాయి.

Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాజగోపాల్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ వీడకుండా రాజగోపాల్ ను బుజ్జగించారు.

Komatireddy RajGopal Reddy : కుట్ర జరుగుతోంది.. బీజేపీలో చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి క్లారిటీ

భట్టితో భేటీ అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ మారొద్దని భట్టి తనకు సూచించారని చెప్పారు. కొత్త వాళ్లు పార్టీలో పదవులు చేపడితే ఇబ్బందిగా ఉందన్నారు. తనది నిజమైన కాంగ్రెస్ రక్తమని, నిజమైన నేతలకు పార్టీలో గౌరవం లేదని రాజగోపాల్ రెడ్డి వాపోయారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలవంతుడని, ఆయన్ను ఓడించాలంటే బలం కావాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

komatireddy rajgopalreddy : తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదు..కొత్తగా వచ్చినవారికి పదవులు..కష్టపడినవారికి ఉత్త‘చేతులు’..

తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగానే కలిశానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నా.. బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది. కోమటిరెడ్డి వ్యవహారం గురించి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తెప్పించుకున్నారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పార్టీపై సాగర్ ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్స్ ను కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు