Rahul OU Tour : ఓయూలో రాహుల్ పర్యటనపై రిజిస్ట్రార్ లేఖ..అనుమతి నిరాకరణకు కారణాలు వెల్లడి
యూనివర్సిటీ ఆవరణలో రాజకీయ, మత పరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని గత ఏడాది జూన్ 31న వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని ఆయన తన లేఖలో గుర్తు చేశారు.
- bheemraj
- Published On : May 2, 2022 / 04:59 PM IST
Rahul Ou Tour
Rahul OU Tour : ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించాలంటూ మానవతా రాయ్, ప్రతాప్ రెడ్డి, జగన్నాథ్ యాదవ్, చందనా రెడ్డి రాసిన లేఖకు వర్సిటీ రిజిష్ట్రార్ లక్ష్మీ నారాయణ సమాధానం ఇచ్చారు. ఏ ఏ కారణాల వల్ల రాహుల్ గాంధీ పర్యటనను నిరాకరిస్తున్నామో లేఖ ద్వారా వెల్లడించారు.
యూనివర్సిటీ ఆవరణలో రాజకీయ, మత పరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని గత ఏడాది జూన్ 31న వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని ఆయన తన లేఖలో గుర్తు చేశారు. అంతేగాక శాంతిభద్రతల నేపథ్యంలో వర్సిటీలో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని కొన్ని విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని, పైగా ఎంబీఏ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారని గుర్తు చేశారు.
అలాగే మే 7న వర్సిటీ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు కూడా వున్నాయని, ఈ మధ్యనే ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో వేలాదిమంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారని అన్నారు.
