KTR : మాది గాంధీ వారసత్వం.. ప్రధానిది గాడ్సే వారసత్వం : మంత్రి కేటీఆర్

రాష్ట్రాన్ని ఆరు దశాబ్ధాలు ఆగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. కాంగ్రెస్ లో సీటు రావాలంటే కోట్ల పెట్టుబడి పెట్టాలని ఆరోపించారు.

KTR : మాది గాంధీ వారసత్వం.. ప్రధానిది గాడ్సే వారసత్వం : మంత్రి కేటీఆర్

KTR Strong Counter Modi

Updated On : October 2, 2023 / 3:25 PM IST

KTR – PM Modi : కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడారని పేర్కొన్నారు. తమది గాంధీ వారసత్వమని.. ప్రధానిది గాడ్షే వారసత్వమని పేర్కొన్నారు. కాంగ్రెస్ తీరుపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారెంటీలను నమ్ముదామా అని అన్నారు. సోమవారం సూర్యపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్రాన్ని ఆరు దశాబ్ధాలు ఆగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. కాంగ్రెస్ లో సీటు రావాలంటే కోట్ల పెట్టుబడి పెట్టాలని ఆరోపించారు. కోమటిరెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.

Also Read : ఎన్టీఆర్‌కి, కేటీఆర్‌కి నక్కకి కుక్కకి ఉన్నంత తేడా ఉంది : రేవంత్ రెడ్డి

తెలంగాణలో కుటుంబ పాలన అంటారు.. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. వారసత్వ రాజకీయం అంటున్నారు.. తమది కాకతీయ పాలకుల వారసత్వ రాజకీయం అన్నారు. గొలుసుకట్టు చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు.

మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లోనే ఉందన్నారు. మజ్లిస్ స్టీరింగ్ అసుద్దీన్ చేతుల్లోనే ఉందని తెలిపారు.