House Shifting : ఇల్లు షిఫ్ట్ చేస్తామని చెప్పి.. సామాన్లతో పరార్

ఇల్లు షిఫ్ట్ చేసేందుకు ఓ వ్యక్తి ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని బుక్ చేశాడు. దీంతో షిఫ్ట్ చేసేందుకు వచ్చిన వారు సామాను వ్యాన్‌లో నింపి వ్యానుతోసహా పారిపోయారు.

House Shifting

House Shifting : ఈ మధ్యకాలంలో ఇల్లుమారాలి అంటే ఎక్కువగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెబ్ సీట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొంచం డబ్బు ఎక్కువైనా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆన్ లైన్ లో బుక్ చేసి ఇంటిని షిఫ్ట్ చేసేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మాయగాళ్లు చేతిలో చిక్కి డబ్బుతోపాటు సమన్లు కూడా పోగొట్టుకుంటున్నారు కొందరు. తాజాగా నగరంలో జరిగిన ఓ ఘటన ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో దొంగలు చొరబడ్డారేమే అనే అనుమానాల్ని రెక్కెట్టిస్తుంది.

చదవండి : Hyderabad Crime : చదువు కోసం దాచుకున్న డబ్బు దోచేసిన సైబర్ నేరగాళ్లు

వివరాల్లోకి వెళితే.. మోతీనగర్‌లోని అవంతినగర్‌ ఈస్ట్‌లో నివాసముండే కిరణ్‌.. హైదరాబాద్‌లో ఎల్‌ఐసీ బ్రాంచ్‌ హెడ్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ ట్రాన్స్‌ఫర్ కావటంతో ఇంట్లో సామాను తరలింపు కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశారు. ఉర్మి లాజిస్టిక్స్‌ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ను బుక్‌ చేసుకొన్నారు. మరుసటిరోజు ఇంటికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు రూ.12,980 అవుతుందని చెప్పి రూ.100 అడ్వాన్స్ తీసుకెళ్లారు. ఆ తర్వాతి రోజు వచ్చి సామాను మొత్తం సర్ది వ్యానులో పెట్టారు. వస్తువులన్నీ ఎక్కాయే లేదో చూసుకొని.. బస్సులో విశాఖకు పయనమయ్యారు కిరణ్.. అతడి భార్య కూతురు. బస్సులో వెళ్తున్న సమయంలో ఆ ధర తమకు గిట్టదని రూ.27 వేలు చెల్లించాలని కిరణ్‌కు ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ నుంచి సందేశం వచ్చింది.

చదవండి : Hyderabad Crime : నగరంలో నయామోసం.. నకిలీ డీఎస్పీని అడ్డుపెట్టి రూ.1.2 కోట్లు దోచేశారు

కంగారుపడిన కిరణ్ వ్యాన్ లోని వ్యక్తికి ఫోన్ చేశాడు. అతడినుంచి కూడా అదే సమాధానం వచ్చింది. రూ.27 వేలు ఇవ్వాలని లేదంటే మీ సామాను తీసుకెళ్లి గూడంలో వేస్తామని నిర్లక్షపు సమాధానం చెప్పారు. గూడం ఛార్జి కింద రోజుకు రూ.3,000 చెల్లించాలని చెప్పడంతో కంగుతిన్న కిరణ్ భార్య, కూతురిని విశాఖలో దింపి హైదరాబాద్ వచ్చి సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చదవండి : Hyderabad Crime : సెలైన్ బాటిల్‌లో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ యువ వైద్యుడు

హిందీలో మాట్లాడుతూ తాము చెప్పిన అడ్రెస్ కి రావాలని.. గూగుల్ పే ద్వారా డబ్బు పే చెయ్యాలని చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాన్‌లో దాదాపు రూ.4 లక్షల విలువైన సామాను ఉన్నదని, ఐదు రోజులు గడిచినా ఆ మోసగాళ్ల ఆచూకీ లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ ఘనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఆ పార్సిల్ సర్వీస్ నిజంగా ఉందా లేదంటే ఫేక్ కా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. సామాను ఇంకా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెబుతున్నారు.