Hyderabad Crime : సెలైన్ బాటిల్‌లో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ యువ వైద్యుడు

హైదరాబాద్ నగరంలో యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెలైన్ బాటిల్‌లో విషం కలుపుకొని శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకొని మరణించాడు

Hyderabad Crime : సెలైన్ బాటిల్‌లో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ యువ వైద్యుడు

Hyderabad Crime (3)

Updated On : December 12, 2021 / 11:37 AM IST

Hyderabad Crime : హైదరాబాద్ నగరంలో యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా బద్వేలుకు చెందిన డాక్టర్ రాజ్‌కుమార్ (29) బీకేగూడలోని ఓ ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటూ అమీర్‌పేట శ్యామ్‌కరణ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే స్నేహితుడికి ఫోన్ చేసి తన మనసు బాగోలేదంటూ పలు విషయాలు చెప్పి.. ఫోన్ కట్ చేశాడు.

చదవండి : Nalgonda Crime : పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకొని.. మూడు నెలలకే ఆత్మహత్య

కొద్దీ సేపటి తర్వాత స్నేహితుడు తిరిగి ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో మరో వైద్యుడు శ్రీకాంత్‌కు సమాచారమిచ్చాడు. రాజ్ కుమార్ ఇంటివద్దకు వచ్చి పరిశీలించేగా చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజ్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజ్ కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు సంబందించిన కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నయ్యారు.

చదవండి : Hyderabad Crime : భార్యపై అనుమానం..! చంపేసి ఇంటికి తాళం వేసి.. ఆ తర్వాత