Hyderabad Crime : భార్యపై అనుమానం..! చంపేసి ఇంటికి తాళం వేసి.. ఆ తర్వాత

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది.. అనుమానంతో భార్యను హత్యచేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడో భర్త

Hyderabad Crime : భార్యపై అనుమానం..! చంపేసి ఇంటికి తాళం వేసి.. ఆ తర్వాత

Hyderabad Crime (2)

Updated On : December 11, 2021 / 11:51 AM IST

Hyderabad Crime :  హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది.. అనుమానంతో భార్యను హత్యచేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడో భర్త.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రంప గ్రామానికి చెందిన పుణ్యవతి అలియాస్ భవాని శిరీష(21) శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన సంతోష్ (28)కి ఈ ఏడాది మేలో వివాహం జరిగింది. వివాహం అనంతరం భార్యతో హైదరాబాద్ వచ్చేశాడు సంతోష్. హైదరాబాద్ మూసాపేట గూడ్స్ షెడ్ వద్ద వెల్డింగ్ షాప్ నడుపుతున్నాడు.

చదవండి : Hyderabad Crime : కేబుల్ వ‌ర్క్ చేయ‌డానికొచ్చి పాడుపని.. చితకబాదిన స్థానికులు

భార్యపై అనుమానంతో గడిచిన ఆరు నెలల్లో నాలుగు ఇల్లులు మారాడు సంతోష్. తాజాగా వెల్డింగ్ షాప్ ఎదురుగా ఉన్న ఇంట్లోనే అద్దెకు దిగాడు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హత్యచేసినట్లు సమాచారం. భార్య మృతదేహం ఇంట్లోపెట్టి బయట తాళం వేసి పారిపోయాడు సంతోష్.. కుటుంబ సభ్యులు ఎంత ఫోన్ చేసినా ఫోన్ తీయకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూశారు.

చదవండి : Hyderabad Crime : భర్త బ్లౌజ్ సరిగా కుట్టలేదని భార్య ఆత్మహత్య

తాళం వేసి ఉండటంతో పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా శిరీష మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకి పంపారు. గురువారం మధ్యాహ్నం హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గొంతు, మొహంపై గాయాలు ఉన్నాయని పోలీసులు నిర్దారించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.