Hyderabad Crime : భర్త బ్లౌజ్ సరిగా కుట్టలేదని భార్య ఆత్మహత్య

భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

Hyderabad Crime : భర్త బ్లౌజ్ సరిగా కుట్టలేదని భార్య ఆత్మహత్య

Hyderabad Crime

Updated On : December 5, 2021 / 8:12 AM IST

Hyderabad Crime : భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాసులు, విజయలక్ష్మి (35) దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరు గోల్నాక తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసులు బైక్‌పై తిరుగుతూ చీరలు అమ్ముతుంటాడు. దీంతోపాటు ఇంట్లో టైలరింగ్ చేస్తుంటాడు. అయితే శనివారం భార్యకోసం ఓ బ్లౌజ్ కుటాడు శ్రీనివాసులు.. అది ఆమెకు నచ్చకపోవడంతో కుట్లు మొత్తం విప్పి తననే కుట్టుకోవాలని సూచించాడు. దీంతో మనస్థాపం చెందిన విజయలక్ష్మి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుంది.

చదవండి : Hyderabad Crime : పాతబస్తీలో దారుణ హత్య

ఎప్పటిలాగానే వెళ్లిందోమో అనుకోని తన పనిలో నిమగ్నమయ్యాడు శ్రీనివాసులు. స్కూల్‌కి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చి బెడ్‌రూమ్ డోర్ కొట్టారు. ఎంతకు డోర్ తీయకపోవడంతో శ్రీనివాసులు వచ్చి బలవంతంగా తలుపులు తీసి చూడగా అప్పటికే ఫ్యాన్‌కి ఉరివేసుకొని విజయలక్ష్మి మృతి చెందింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో విజయలక్ష్మి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చదవండి : Hyderabad Crime : ఆటోలో మహిళపై అత్యాచారయత్నం