Suicide case: తల్లి, కొడుకు ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యప్తు ముమ్మరం.. నిందితుల కోసం గాలింపు

కామారెడ్డి పట్టణంలోని ఓ లాడ్జిలో మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రామాయంపేటకు చెందిన...

Mother And Sun Sucide Case

Suicide case: కామారెడ్డి పట్టణంలోని ఓ లాడ్జిలో మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రామాయంపేటకు చెందిన పద్మ, కుమారుడు సంతోష్ లు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామాయంపేట టీఆర్‌ఎస్ నేతలు, ఓ సీఐ మొత్తంగా ఏడుగురి వేధింపు వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ వీడియోలో పేర్కొన్నారు. వీరిలో పల్లె జితేందర్‌గౌడ్‌, ఐరేని పృథ్వీరాజ్‌ అలియాస్‌ బాలు, సరాబ్‌ యాదగిరి, తోట కిరణ్‌, కన్నాపురం కృష్ణాగౌడ్‌, సరాబ్‌ స్వరాజ్‌, తాండూరి నాగార్జునగౌడ్‌ కారణమంటూ ఫేస్‌బుక్‌లో వేర్వేరుగా వీడియోలు పెట్టి ప్రాణాలొదిలారు. మా చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శిక్షించాలని వీడియోలో వేడుకున్నారు.

Kamareddy : తల్లి,కొడుకు ఆత్మహత్య..మా చావుకి ఆ ఏడుగురే కారణం

మృతుల సెల్ఫీ వీడియో ప్రకారం ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక విచారణ అధికారిగా బాన్స్‌వాడ డీఎస్పీ జైపాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మృతుల సూసైడ్ నోట్, వీడియో ఆధారంగా ఏడుగురి పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేయగా, నిందితులను పట్టుకునేందుకు అధికారులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. రామాయణ పేట, మెదక్ పోలీసుల సమన్వయంతో కామారెడ్డి పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. కామారెడ్డి పోలీసులు. రామయం పేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ చైర్మన్ యాదగిరి, సీఐ నాగార్జున పాత్ర పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Mother Son Suicide Case : తల్లీ కొడుకు ఆత్మహత్య.. న్యాయం జరిగేలా చూస్తామన్న ఎస్పీ.. అజ్ఞాతంలో సీఐ

మున్సిపల్ చైర్మన్ ఇంటి దగ్గర శనివారం సాయంత్రం మృతదేహాలతో మృతుల కుటుంబ సభ్యులు ఆందోళణ నిర్వహించిన విషయం విధితమే. ఈ క్రమంలో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే ఘటన జరిగి 24గంటలు అవుతున్నా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని మృతుల కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలపైనా పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సెల్ఫీ వీడియోలో పేర్కొన్న వ్యక్తులకు, మృతులకు ఎప్పటి నుంచి ఘర్షణలు ఉన్నాయి. కారణాలు ఏమిటి అనేవాటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తును మొదలు పెట్టినట్లు తెలిసింది.