Mother Son Suicide Case : తల్లీ కొడుకు ఆత్మహత్య.. న్యాయం జరిగేలా చూస్తామన్న ఎస్పీ.. అజ్ఞాతంలో సీఐ

బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామన్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అరెస్ట్ చెయ్యలేదని చెప్పడం సరికాదన్నారు.

Mother Son Suicide Case : తల్లీ కొడుకు ఆత్మహత్య.. న్యాయం జరిగేలా చూస్తామన్న ఎస్పీ.. అజ్ఞాతంలో సీఐ

Mother Son Suicide Case

Mother Son Suicide Case : కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీ కొడుకుల ఆత్మహత్య ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అధికార పక్షానికి చెందిన నేతలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని 10టీవీతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ నివాసం దగ్గర ఆందోళన విరమించారని చెప్పా.

ఐదు సార్లు వారితో మాట్లాడి పరిస్థితి గురించి వివరించినట్లు వెల్లడించారు. వారికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చామన్నారు. గతంలో చనిపోయిన వారు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. గతంలో పని చేసిన ఇన్ స్పెక్టర్ నాగార్జున హస్తం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం నిందితుల కోసం కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామన్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అరెస్ట్ చెయ్యలేదని చెప్పడం సరికాదన్నారు. కేసు నమోదైంది కామారెడ్డిలో అని తెలిపిన ఎస్పీ.. ఇక్కడ మేము ఏమీ చేయలేము అని వెల్లడించారు.(Mother Son Suicide Case)

Kamareddy : తల్లి,కొడుకు ఆత్మహత్య..మా చావుకి ఆ ఏడుగురే కారణం

మరోవైపు తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్ విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. రామాయంపేట ఆత్మహత్యల కేసులో సీఐపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుండి సీఐ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 10 గంటలుగా ఎంత ప్రయత్నించినా మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. సీఐ అధికారిక మొబైల్ స్విచ్చాఫ్ లో ఉంది. అయితే, సీఐ నాగర్జున తనతో టచ్ లో ఉన్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సాంకేతిక కారణాలతో ఫోన్ స్విచ్చాఫ్ అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. కొత్త బస్టాండ్ వద్ద గల ఓ లాడ్జిలో తల్లీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం సృష్టించింది. వ్యక్తిగత విషయాలను అడ్డం పెట్టుకుని తమను ఏడుగురు వ్యక్తులు వేధిస్తున్నారని తమ మృతికి ఏడుగురు వ్యక్తులు కారణమంటూ తల్లి, కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన వారు మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి గంగు పద్మ(65), కుమారుడు గంగు సంతోష్(35) గా గుర్తించారు.

Ramayampet : తల్లికొడుకు ఆత్మహత్య-రామాయంపేటలో ఉద్రిక్తత

18 నెలలుగా రామయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పృథ్వీరాజ్, తోట కిరణ్, కన్నాపురం కృష్ణగౌడ్, స్వరాజ్ లతో పాటు గతంలో రామయంపేగ సీఐగా పని చేసిన నాగర్జున గౌడ్ వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకుని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత 18 నెలల క్రితం రామయంపేట సీఐ నాగార్జున గౌడ్ సంతోష్ సెల్ ఫోన్ తీసుకుని పది రోజుల పాటు తన వద్ద ఉంచుకున్నాడు.

సంతోష్‌కు సంబంధించిన పూర్తి డాటాను నాగర్జున గౌడ్ తస్కరించి ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న జితేందర్ గౌడ్‌కు అప్పగించాడు. గంగు సంతోష్ సెల్ ఫోన్ లో ఉన్న వ్యక్తిగత డేటా ఆధారంగా గంగు సంతోష్ ను ఏడుగురు వ్యక్తులు వేధించడం మొదలు పెట్టారు. సంతోష్‌తో పాటు కుటుంబ సభ్యులను, అక్క బావలను సైతం ఈ ఏడుగురు వ్యక్తులు వేధించారు. దీంతో 18 నెలలుగా గంగు సంతోష్ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు.