Palla Rajeshwar Reddy : మోదీ అన్నీ అబద్దాలు చెప్పారు, తెలంగాణకు ఎలాంటి సాయమూ చేయలేదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy: 28 ప్రాజెక్టులు అడిగితే కేంద్రం ఇచ్చింది 4 ప్రాజెక్టులే. టోల్ రూపంలో రూ.9 వేల కోట్లు తెలంగాణ ప్రజలు చెల్లించారు.

Palla Rajeshwar Reddy (Photo : Twitter)

Palla Rajeshwar Reddy : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. సికింద్రాబాద్ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన విమర్శలు, ఆరోపణలు దుమారం రేపాయి. అవినీతి ప్రభుత్వం, కుటుంబ పార్టీ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రగడకు దారితీశాయి. కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని.. దీంతో తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎదురుదాడికి దిగారు. ప్రధాని మోదీ అవాస్తవాలు చెప్పారని మండిపడుతున్నారు. అసలు నిజం ఇదే అని వివరణ ఇస్తున్నారు.

ప్రధాని మోదీ స్పీచ్ పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ సీఎంకు సరైన సమాచారం ఇవ్వకుండా మోదీ పరేడ్ గ్రౌండ్స్ లో సభ నిర్వహించారని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల సభను ఎన్నికల ప్రచార సభగా మోదీ మార్చారని ధ్వజమెత్తారు. మోదీ తన ప్రసంగంలో డొల్ల మాటలు మాట్లాడారని పల్లా అన్నారు. తెలంగాణకు తొమ్మిదేళ్లుగా ప్రధాని మోదీ ఎలాంటి సాయం చేయలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చలేదన్నారు. ఎయిమ్స్ ప్రకటన చేసిన నాలుగేళ్ళ తర్వాత మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారని చెప్పారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు.(Palla Rajeshwar Reddy)

”దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన మోదీ.. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. మెట్రోకు కావాల్సిన నిధులు ఎవరిచ్చారో తెలంగాణ ప్రజలకు తెలుసు. మెట్రో తమ ఘనతగా మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ 28 ప్రాజెక్టులు అడిగితే కేంద్రం ఇచ్చింది కేవలం మూడు, నాలుగు ప్రాజెక్టులు మాత్రమే. టోల్ రూపంలో రూ.9 వేల కోట్లు తెలంగాణ ప్రజలు చెల్లించారు.

Also Read..Telangana : తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే కేంద్రం అవార్డులు ఎందుకిస్తుంది? అధికారిక కార్యక్రమంలో రాజకీయాలేంటి? : మంత్రి తలసాని

మోడీ తన ప్రసంగంలో మొత్తం అబద్దాలు మాట్లాడారు. తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వలేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వలేదు. అప్పు అడిగినా ఇవ్వలేదు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. యూపీఎ 2011లో 80కోట్ల మందికి రేషన్ ఇస్తే నేడు మోదీ అదే 80కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి 54 లక్షల మందికి ఇస్తే.. అదనంగా 38 లక్షల మందికి రేషన్ ఇస్తున్నాం. తెలంగాణలో ఎక్కువ మంది లబ్దిదారులకు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నాం. తెలంగాణ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంది. దేశంలో అవినీతి రహిత రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 2 స్థానంలో ఉంది. మిర్చి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది.(Palla Rajeshwar Reddy)

Also Read..PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ

అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీజేపీ. హిమంత బిశ్వ శర్మ, నారాయణ రాణె కేసుల సంగతి ఏమైంది? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ అవినీతి జరుగుతోంది. కర్ణాటకలో కాంట్రాక్టర్ నుండి కమీషన్ ను బీజేపీ నేతలు వసూలు చేయలేదా? ముద్ర లోన్స్ ను మోదీ గొప్పగా చెప్పుకుంటున్నారు.
శ్రీలంకలో ఉన్న పోర్టులను అదానీకి ప్రధాని మోదీ కట్టబెట్టారు. హిండెన్ బర్గ్ రిపోర్టును దేశ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీకి దేశంలో ఇవే చివరి ఎన్నికలు” అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.