PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ

తెలంగాణ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందన్నారు. అన్ని పార్టీలను చేతిలో పెట్టుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యం అన్నారు. నిజాయితీగా పని చేసేవారు వారికి గిట్టరన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ

PM Modi

PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని.. దీంతో తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నిర్వహించిన సభలో ప్రధాన మోదీ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రియమైన సోదర సోదరీమణులారా.. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందన్నారు. అన్ని పార్టీలను చేతిలో పెట్టుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యం అన్నారు. నిజాయితీగా పని చేసేవారు వారికి గిట్టరన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

PM Modi – CM KCR : కేసీఆర్‌ను సన్మానించేందుకు శాలువా తెచ్చా : బండి సంజయ్

తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించే మహత్తర అవకాశం తనకు లభించిందని ప్రధాని మోదీ అన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయం ఉన్న నగరానికి తిరుమల వెంకటేశ్వర స్వామికి కలిపే ట్రైన్ ను ప్రారంభించామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వికాసానికి కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యతగా భావిస్తుందన్నారు.

అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు తాము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో 70 కిలో మీటర్లకు పైగా మెట్రో కారిడార్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కొత్తగా 13 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను ప్రారంభించామని తెలిపారు. వీటి ద్వారా హైదరాబాద్ పరిసర జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. తెలంగాణలో 9 ఏళ్లలో అనేక రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధి చేశామని చెప్పారు.

PM Modi : వందే భారత్ రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించిన ప్రధాని మోదీ

రైల్వేలతోపాటు జాతీయ రహదారులకు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. కల్వకుర్తి-కొల్లాపూర్ జాతీయ రహదారి, మహబూబ్ నగర్-చెంచోరీ రహదారి, తెలంగాణలో రహదారులకు రూ.35 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అంతకముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.

అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదిక నుంచే ప్రధాని మోదీ వర్చువల్ గా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించారు. 13 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించారు. రూ.11 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, రూ.1365.95 కోట్లతో ఎయిమ్స్ 750 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు.