PM Modi : వందే భారత్ రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించిన ప్రధాని మోదీ

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించారు.

PM Modi : వందే భారత్ రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించిన ప్రధాని మోదీ

pm modi inaugurates vande bharat rail

PM Modi :  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందేభారత్ రైలు ఎక్కి విద్యార్ధులతో ముచ్చటించారు. పలువురు విద్యార్థులతో ఆత్మీయ ముచ్చటించారు. వారి భుజం తట్టి ప్రోత్సహించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకున్నారు. ఈ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

అనంతం ప్రధాని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 11 వేల కోట్ల అభివృద్ది కార్యక్రమాల ప్రారంభించనున్నారు. 1365.95 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ 750 పడకల హాస్పటల్ కి శంకుస్థాపన, తెలంగాణలోని 410 కిలోమీటర్ల జాతీయ రహదారులు విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 720 కోట్ల సికింద్రాబాద్ రైల్వే అభివృద్ది పనులకు శంకుస్థాపన వంటి పనులు చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్ – మేడ్చల్, ఫలక్ నామ – ఉందానగర్ రూట్లలో 13 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభిస్తారు. మొదటి దశలో 44 కిలోమీటర్ల మార్గం వరకు ఎంఎంటీఎస్, రెండవ దశలో 51 కిలోమీటర్లు అందుబాటులోకి రానున్నాయి.