Telangana : తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే కేంద్రం అవార్డులు ఎందుకిస్తుంది? అధికారిక కార్యక్రమంలో రాజకీయాలేంటి? : మంత్రి తలసాని

తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణలో అభివృద్ధే జరగలేదని అంటున్న మోదీ .. అభివృద్ధి జరగకపోతే కేంద్రం తెలంగాణకు అవార్డులు ఎందుకిస్తోంది? అని ప్రశ్నించారు.

Telangana : తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే కేంద్రం అవార్డులు ఎందుకిస్తుంది? అధికారిక కార్యక్రమంలో రాజకీయాలేంటి? : మంత్రి తలసాని

Talasani counters PM Modi

Telangana :  ప్రధాని మోదీ సికింద్రాబాద్ పర్యటన సందర్భంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రధాని మోడీకి స్వాగతం పలకటానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. సీఎంవో కార్యాలయం స్వయంగా ఆహ్వానం పలికినా కేసీఆర్ రాకపోవటంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ కూడా కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది చేయకుండా స్వలాభం చూసుకుంటున్నారని కుటుంబ పాలనతో దోచుకుంటున్నారంటూ విమర్శించారు.

ప్రధాని మోదీ విమర్శలపై మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదన్నారు. తెలంగాణలో అభివృద్ధే జరగలేదని అంటున్న మోదీ .. అభివృద్ధి జరగకపోతే కేంద్రం తెలంగాణకు అవార్డులు ఎందుకిస్తోంది? అని ప్రశ్నించారు. వందే భారత్ రైలును ప్రారంభించటానికి..అధికారిక కార్యక్రమాలకు వచ్చిన ప్రధాని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయటమేంటీ అంటూ మండిపడ్డారు. అసలు వందే భారత్ రైళ్లను ప్రధాని ఎన్నిసార్లు ప్రారంభిస్తారు? అంటూ ఎద్దేవా చేశారు.

PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ

దేశంలోనే 24గంటల కరెంట్ ఇచ్చేది తెలంగాణలో మాత్రమేనని..కానీ 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారు అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది దీనిపై చర్చించటానికి బీజేపీ సిద్ధంగా ఉందా? అంటూ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్, సాగు,తాగునీరు ఇస్తున్నామని మేం గర్వంగా చెప్పుకుంటాం..కాదంటున్న బీజేపీ చర్చించటానికి బీజేపీ వస్తుందా? అని ప్రశ్నించారు.

మాట్లాడితే కుటుంబ పాలన అంటూ విమర్శించే బీజేపీలో కుటుంబ పాలన లేదా?కేసీఆర్ కుటుంబ తెలంగాణ కోసం పోరాడింది. స్వరాష్ట్రం సాధించింది కేసీఆర్ కాదా అన్నారు. ఈడీ, సీబీఐ కేసులున్నవారు బీజేపీ పాలిత ప్రాంతాల్లో సీఎంలుగా ఉన్నారని ఆరోపించిన తలసాని వారిపై మాత్రం విచారణలుండవన్నారు. కానీ బీజేపీని ప్రశ్నించే రాష్ట్రాలపై మాత్రం ఈడీ,సీబీఐ దాడులు చేయిస్తారని అలా భయపెట్టి అధికారంలోకి రావటానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ఇటువంటి బెదిరింపులకు కేసీఆర్ భయపడరు అన్నారు తలసాని. మా ప్రభుత్వంపై విమర్శలు చేసేముందు తెలంగాణకు నిధులు ఇచ్చి అప్పుడు మాట్లాడండీ పక్షపాత వైఖరితో తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని విమర్శించారు.

Bandi Sanjay : కేసీఆర్‌ను సన్మానించేందుకు శాలువా తెచ్చా : బండి సంజయ్