Hyderabad Parks : ప్రేమ జంటలకు షాక్.. పార్కులు క్లోజ్

ప్రేమికుల రోజు హైదరాబాద్‌లోని పార్కులన్నీ మూతపడ్డాయి. పార్కులు, ఇతర ప్రాంతాల్లో ప్రేమ జంటలు కనబడితే అడ్డుకుంటామన్న...

Valentine’s Day 2022 : ఫిబ్రవరి 14..వాలంటైన్స్ డే. ఈ రోజు వచ్చిందంటే చాలు చాలా మంది ప్రేమికులు పార్కుల్లో వాలిపోతుంటారు. గులాబి చేతిలో పట్టుకుని ప్రేమికురాలికి తన ప్రేమను వ్యక్తపరచాలని అనుకుంటాడు. పార్కుల్లో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవాలని అనుకుంటుంటారు. ప్రేమికుల దినోత్సవాన్ని అంగరంగవైభవంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. హోటల్స్, పర్యాటక ప్రాంతాలు సందడి సందడిగా మారుతాయి. కానీ.. ఈ వాలంటైన్స్ డేను వ్యతిరేకించే భజరంగ్ దళ్ కార్యకర్తలు వారి వెంట పడే ఘటనలు చూస్తుంటాం. పార్కుల్లో వైవిధ్య ఘటనలు దర్శనమిస్తుంటాయి. దీంతో పార్కుల వైపు తొంగిచూడడం మానేశారు.

Read More : CM KCR-Assam CM : సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నించటమంటే మన సైనికులను అవమానించటమే..కేసీఆర్ కు అసోం సీఎం కౌంటర్

దీంతో పోలీసులు పలు నిర్ణయాలు తీసుకుంటుంటారు. పార్కులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ సంవత్సరం కూడా అదే జరిగింది. ప్రేమికుల రోజు హైదరాబాద్‌లోని పార్కులన్నీ మూతపడ్డాయి. పార్కులు, ఇతర ప్రాంతాల్లో ప్రేమ జంటలు కనబడితే అడ్డుకుంటామన్న భజరంగ్ దళ్ హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా పోలీసులు ప్రధాన పార్కులకు మూసివేసి భద్రత ఏర్పాటు చేశారు. టూరిజం ప్రాంతాలైన లుంబినీ పార్కు, ఎన్‌టిఆర్ గార్డెన్స్‌ను సైతం మూసివేశారు. పార్కులు ప్రేమికులకు అడ్డాలు. వాలెంటైన్స్‌ డేకి ఎక్కువ మంది వస్తారు. ప్రేమికుల రోజు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమన్నది భజరంగ్‌దళ్‌ వాదన. ప్రేమికులు కనిపిస్తే వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు.. పెళ్లి కూడా చేస్తామని వారు హెచ్చరికలు జారీ చేస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు