CM KCR-Assam CM : సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నించటమంటే మన సైనికులను అవమానించటమే..కేసీఆర్ కు అసోం సీఎం కౌంటర్

సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నించటమంటే..భారత వీర సైనికులను అవమానించటమేనని ..కేసీఆర్ కు అసోం సీఎం కౌంటర్ ఇచ్చారు.

CM KCR-Assam CM : సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నించటమంటే మన సైనికులను అవమానించటమే..కేసీఆర్ కు అసోం సీఎం కౌంటర్

Assam Cm Himanta Biswa Sharma Counters Ts Cm Kcr

Assam cm himanta biswa sharma counters ts cm kcr : తెలంగాణ సీఎం కేసీఆర్ కు అసోం సీఎం కౌంటర్ హిమంత బిశ్వ శర్మ కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రశ్నించటమంటే వీర సైనికుల్ని అవమానించటమేనని అన్నారు. పుల్వామా ఘటనలో అమరులైన సైనికులను అవమానించేలా మాట్లాడుతున్నారని.. గాంధీ కుటుంబంపై విధేయత చూపటానికి కాంగ్రెస్ నేతలు, సీఎం కేసీఆర్ పోటీ పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

కాగా..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్న క్రమంలో సీఎం కేసీఆర్ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను పదవి నుంచి బర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ పై భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ డిమాండ్ కు కేంద్రం సమాధానం చెప్పలేక రాహుల్ పై అసభ్యపదజాలంతో వ్యాఖ్యానించటం సరికాదని..ఆ మాటకొస్తే సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి ఆధారాలు చూపించాలని తాను కూడా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానని కేసీఆర్ అన్నారు. దీనిపై అసోం సీఎం హిమంత సీఎం కేసీఆర్ కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

Also read : CM KCR Demanded : అసోం సీఎం హిమంతబిశ్వ శర్మను బర్త్ రఫ్ చేయాలి : సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ డిమాండ్

సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రశ్నించటమంటే..పుల్వామా ఘటనలో అమరులైన సైనికులను అవమానించటమేనని అన్నారు. గాంధీ కుటుంబంపై విధేయత చూపటానికి కాంగ్రెస్ నేతలు, సీఎం కేసీఆర్ పోటీ పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ విధేయత అనేది భారతదేశం పట్ల ఉంటుందని స్పష్టంచేశారు. ప్రాణాలకు తెగించి పోరాడే ఆర్మీ బలగాల శక్తిని ప్రశ్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని సీఎం హిమంత బిశ్వ శర్మ ఎదురు దాడికి దిగారు.

కాగా..పుల్వామాలో భారత్ ఆర్మీపై పాక్ బలగాలు విరుచుకుపడిన ఘటన తరువాత భారత్ పాక్ పై ప్రతీకారం తీర్చుకోవటానికి సర్జికల్ స్ట్రైక్స్ చేశామని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లుగా ఆధారాలు చూపించాలని రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ డిమాండ్ చేయటంలో తప్పేముందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాను కూడా కేంద్రాన్ని అదే డిమాండ్ చేస్తున్నానని… సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపాలని అడుగుతున్నానని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Also read : CM KCR : ‘నరేంద్రమోదీని తరిమి.. తరిమి కొట్టాలి’.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

ఇటీవల రాహుల్ గాంధీని ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు కావాలని రాహుల్ అడిగారని… దానికి సమాధానం చెప్పలేక బీజేపీ నేతలు అసభ్య పదజాలంతో రాహుల్ ని దారుణంగా మాట్లాడారని..రాహుల్ గాంధీ రాజీవ్ కు పుట్టారనే ఆధారాలను బీజేపీ ఎప్పుడైనా అడిగిందా? అంటూ అసోం సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ హిమంతపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలకు అసోం సీఎం కౌంటర్ ఇచ్చారు. పుల్వామా దాడి వార్షికోత్సవం సందర్భంగా సర్జికల్ స్ట్రయిక్స్ ను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు మళ్లీ మన అమరవీరులను అవమానించాయని అన్నారు. గాంధీ కుటుంబానికి తమ విధేయతను నిరూపించుకునే ప్రయత్నంలో వారు సైన్యానికి ద్రోహం చేసేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సైన్యం పట్ల తనకు ఎంతో విధేయత ఉందని అన్నారు. మీ జీవితకాలమంతా తనను విమర్శించినా తాను కేర్ చేయబోనని అన్నారు.