CM KCR : ‘నరేంద్రమోదీని తరిమి.. తరిమి కొట్టాలి’.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

కరెంట్ సంస్కరణల పేరుతో మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మెడపై కత్తి పెడుతుందన్నారు. రైతులకు సబ్సిడీ ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తోందని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రస్తక్తే లేదన్నారు.

CM KCR : ‘నరేంద్రమోదీని తరిమి.. తరిమి కొట్టాలి’.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Kcr Fired Modi 11zon

CM KCR Sensational Comments : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని అన్నారు. నరేంద్రమోదీని తరిమి.. తరిమి కొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపిచ్చారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తెచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఏడాది పాటు రైతులను నానా ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో ప్రజలకు భయపడి వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నారని తెలిపారు. రైతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా క్షమాపణలు కూడా చెప్పారని పేర్కొన్నారు.

కరెంట్ సంస్కరణల పేరుతో మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మెడపై కత్తి పెడుతుందన్నారు. రైతులకు సబ్సిడీ ఇవ్వొద్దని కేంద్రం ఒత్తిడి తెస్తోందన్నారు. ఫ్రీ కరెంటు కావాలా.. మోటార్లకు మీటర్లు పెడదామా అని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీని తరిమి తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు. 8 ఏళ్ల బీజేపీ పరిపాలన దేశాన్ని సర్వ నాశనం చేసిందని విమర్శించారు. సోషల్ మీడియాలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

CM KCR : కేంద్రం కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ : సీఎం కేసీఆర్

రాయగిరి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏ రంగానికి మంచి చేశారో మోదీ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్, జల వినియోగంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ తెలివితక్కువ తనమే జల వివాదాలకు కారణం అన్నారు. పండించిన పంట కొనడం కేంద్రానికి చేతకాదని ఎద్దేవా చేశారు. దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయని వాపోయారు. భారత దేశాన్ని ఆకలిరాజ్యంగా మారుస్తారా అని నిలదీశారు.

తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. బీజేపీ ఉంటే, మతం కల్లోలం రేగితే లాఠీచార్జీలు, కర్ఫ్యూలు, ఫైరింగ్ లు ఉంటాయని కాబట్టి రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు. శాంతి, సౌఖ్యం, లా అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడి పెట్టేవారు వస్తారని, కార్ఖానాలు, ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పారు. ఈ దేశం ఎవరి అయ్య సొత్తు కాదు.. మోదీ దేశాన్ని నాశనం చేస్తుంటే ఇక్కడ తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని హెచ్చరించారు.

CM KCR Demanded : అసోం సీఎం హిమంతబిశ్వ శర్మను బర్త్ రఫ్ చేయాలి : సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ డిమాండ్

ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో మత ఘర్షణలు రేపుతున్నారని విమర్శించారు. దేశంలో రోజూ కర్ఫ్యూలు, పోలీసుల లాఠీచార్జీలే కావాలా అన్నారు. అమెరికాలో 95 శాతం క్రైస్తవులు ఉంటారు.. కానీ వారు ఎన్నడూ మత పిచ్చి లేపరని తెలిపారు. అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్నారని చెప్పారు. విద్యుత్ సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ప్రజలు ఎదుర్కొన్నఅతి పెద్ద సమస్య లాక్ డౌన్ అన్నారు. మోదీ అనాలోచిత నిర్ణయంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ గురించి మోదీ ఏదేదో మాట్లాడారని తెలిపారు. నన్ను సముద్రంలో నీటి బిందువు అని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.. నేనేంటో బీజేపీ నేతలకు చూపిస్తా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు.