CM KCR : కేంద్రం కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ఎకరా భూమి విలువ రూ.25లక్షలకు పైనే ఉందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోనూ భూముల విలువ పెరిగిందని తెలిపారు.

CM KCR : కేంద్రం కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ : సీఎం కేసీఆర్

Cm Kcr (5)

Telangana CM KCR : జిల్లాల పునర్విభజనపై తాను సంప్రదించిన తొలి వ్యక్తి ఛత్తీస్ గఢ్ చీఫ్ అడ్వైజర్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు.. కానీ కుదరలేదన్నారు. యాదాద్రి పర్యటనలో భాగంగా కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఎకరా భూమి విలువ రూ.25లక్షలకు పైనే ఉందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోనూ భూముల విలువ పెరిగాయని తెలిపారు.

నాడు వందల అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు వచ్చేవి కావు.. నేడు 15 నుంచి 20 అడుగుల్లో నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. వాటర్ షెడ్డింగ్ తోనే భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. హైదరాబాద్-వరంగల్ కారిడార్ అభివృద్ధి చెందుతోందన్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్ని ఆర్థికపురోగతిలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు.

CM KCR : యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

కేంద్రం కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ అని పేర్కొన్నారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 8 రోజుల్లో ఆ కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 3 ఎకరాలు ఉన్న రైతు ధనికుడు అన్నారు.