CM KCR Demanded : అసోం సీఎం హిమంతబిశ్వ శర్మను బర్త్ రఫ్ చేయాలి : సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ డిమాండ్

అసోం సీఎం హిమంతబిశ్వ శర్మను బర్త్ రఫ్ చేయాలి అని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

CM KCR Demanded : అసోం సీఎం హిమంతబిశ్వ శర్మను బర్త్ రఫ్ చేయాలి : సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ డిమాండ్

Assam Cm Should Be Dropped..cm Kcr Demanded

Assam CM should be dropped..CM KCR demanded : రాహుల్ గాంధీ గురించి అసభ్యంగా వ్యాఖ్యానించిన  అసోం సీఎం హిమంతబిశ్వ శర్మను బర్త్ రఫ్ చేయాలని సీఎం కేసీఆఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం అంతా దేశం కోసమే పనిచేసిందని..అటువంటి రాహల్ గాంధీ తండ్రి గురించి అసోం సీఎం అత్యంత అసభ్యంగా మాట్లాడారని కాబట్టి ఆయన్ని సీఎంగా బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బీజేపీ విధానాల గురించి అవినీతి గురించి వివాదాల గురించి ప్రశ్నిస్తున్నారనే ఆయన్ని టార్గెట్ చేసి అసోం సీఎం హిమంత బిశ్వ అసభ్యంగా మాట్లాడారని అటువంటి వ్యక్తి సీఎంగా ఉండే అర్హత లేదని వెంటనే అతన్ని బీజేపీకి చిత్తశుద్ది ఉంటే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం చేసిన పనులను విమర్శిస్తుంటే.. ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతూ..బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని సీఎం కేసీీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.

Also read : CM KCR : భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదు : సీఎం కేసీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిది మతపిచ్చి తప్ప అభివృద్ధి చేసే యోచనలేదని..బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఏం అభివృద్ధి జరిగింది? అని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వానికి కేవలం అవినీతి చిట్టాయేనని..ఆ అవినీతి చిట్టా నాదగ్గర ఉందని జాగ్రత్తగా మాట్లాడాలని డైరెక్టుగా ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం అంతా అట్లర్ ప్లాపేనని ఎద్దేవా చేశారు. బీజేపీ సంగతి దేశమంతా అన్ని భాషల్లోను దండోరా వేస్తామని అన్నారు.

కాగా..బీజేపీ నేతలు విచక్షణ మరచి రాజకీయంగా కాకుండా వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తున్నారు. దీంట్లో భాగంగానే అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. 2016లో పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగిందనడానికి సాక్ష్యం ఏదని అడిగిన రాహుల్‌ను సీఎం హింమంత బిశ్వ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ‘రాహుల్‌ ఏ తండ్రికి జన్మించారో సాక్ష్యం కావాలని మేం అడిగామా’ అంటూ అత్యంత అసభ్యంగా వ్యాఖ్యానించారు శర్మ అన్నారు.

Also read : CM KCR : కేంద్రం కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువ : సీఎం కేసీఆర్

బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన సీఎం కేసీఆర్ సిలికాన్ వ్యాలీ బెంగ‌ళూరులో మ‌త‌పిచ్చి లేపి కశ్మీర్ వ్యాలీలా మార్చుతున్నారని..ఇది దేశానికి అవ‌స‌ర‌మా? అని ప్రశ్నించారు. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. ఐటీ రంగంలో భార‌త‌దేశానికే సిలికాన్ వ్యాలీ బెంగ‌ళూరు సిటీ.. క‌ర్ణాట‌క రాష్ట్రం. దాని త‌ర్వాత రెండో స్థానంలో ఉన్న‌ది మ‌న హైద‌రాబాద్ సిటీ.. తెలంగాణ రాష్ట్రం. క‌ర్ణాట‌క‌లో ఏం జ‌రుగుతోంది దేశమంతా చర్చించుకుంటోంది. ఇది బీజేపీ మతపిచ్చిని నిదర్శనమని కర్ణాటలకో హిజాబ్ వివాదం గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించారు.ఆడ‌పిల్ల‌ల మీద.. మ‌న బిడ్డ‌ల మీద.. ప‌సికూన‌ల మీద రాక్ష‌సుల్లా ప్ర‌వ‌ర్తించ‌వ‌చ్చునా? అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇటువంటి బీజేపీ దేశానికి పట్టిన దరిద్రం అని..ఆ దరిద్రాన్ని వదిలించాలని..పారద్రోలాలి అని ప్ర్రజలకు సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా వేదికగా పిలుపునిచ్చారు.