CM KCR : భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదు : సీఎం కేసీఆర్

దేశంలో అత్యంత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రస్తుతం తెలంగాణను అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు.

CM KCR : భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదు : సీఎం కేసీఆర్

Cm Kcr Speech 11zon

Updated On : February 12, 2022 / 5:21 PM IST

Bhuvanagiri district : భువనగిరి జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. సంస్కరణల్లో భాగంగా భువనగిరి జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భువనగిరి ప్రజలు తన వెంట నిలిచారని పేర్కొన్నారు. రాయగిరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతలకు అండగా నిలిచామని చెప్పారు.

దేశంలో అత్యంత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం తెలంగాణకు అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు. అవినీతికి తావు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని తెలిపారు. ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల ధర ఎంత? ప్రస్తుతం భూముల ధర ఎంత ? అని ప్రశ్నించారు.

CM KCR : యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

మారుమూల పల్లెల్లోనూ ఎకరా భూమి ధర రూ.20 లక్షలకు తక్కువ లేదన్నారు. తెలంగాణలో సంపద పెరిగిందని చెప్పారు. ఇన్నేళ్లు కేంద్రం సహకరించుకున్నా తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలనే రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.