TRS Parliamentary Party : పార్లమెంట్ సెషన్స్, రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయం

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దక్కాల్సిన ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని ఎంపీలతో తేల్చిచెప్పారు కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, నిధులు, హక్కుల కోసం ఉభయ సభల్లో తీవ్రంగా

Parliament Budget Session TRS : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనుకాడేది లేదని.. పార్లమెంట్‌లో గట్టిగా పోరాటం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కులు, రావాల్సిన నిధుల కోసం ఉభయ సభలను స్తంభింపజేయాలని సూచించారు. సోమవారం నుంచే నిరసనలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందడం లేదన్నారు కేసీఆర్. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలన్నారు. 23 అంశాలతో నివేదిక అందించిన సీఎం కేసీఆర్.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేశారు. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు పలు సూచనలు చేశారు సీఎం కేసీఆర్.

Read More : Karimnagar : కరీంనగర్‌‌లో కారు బీభత్సం, మృతుల కుటుంబాలకు తక్షణ సాయం రూ. 10 వేలు

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దక్కాల్సిన ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని ఎంపీలతో తేల్చిచెప్పారు కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, నిధులు, హక్కుల కోసం ఉభయ సభల్లో తీవ్రంగా పోరాడాలన్నారు. పోరాట ఎజెండా అంశాలు, కార్యాచరణపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారాయన. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలు, పెండింగ్ సమస్యలు, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల వాటాపై ఎంపీలకు నివేదికలు అందించారు. కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాను ఎంపీలకు వివరించారు కేసీఆర్. బయ్యారం ఉక్కు, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్శిటీ, IIM, ITIR లాంటి హామీలు, అంశాలపై నీలదీయాలని కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు. సింగరేణి కోల్ మైన్స్ బ్లాకుల ప్రైవేటీకరణ, ఎరువుల ధర పెంపు.. విద్యుత్ నియంత్రణ చట్టం.. సివిల్ సర్వీసెస్ రూల్స్‌లో సవరణకు వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో గట్టిగా నిరసన తెలుపాలని ఆదేశించారు కేసీఆర్.

Read More : Ram Charan-Sreeja: ముంబై నుండి శ్రీజ ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరుగుతుంది?

సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2022, జనవరి 31వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పధకాలు సహా దేశపురోగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన ప్రసంగం కొనసాగనుంది. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం లోక్ సభలో 2021-22 ఆర్ధిక సర్వేను ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్ సభలో ఆమె ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, కేంద్ర బడ్జెట్ పై చర్చ జరుగనుంది. ఫిబ్రవరి 2 నుంచి సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ, ఫిబ్రవరి 2 నుంచి ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభ సమావేశాలు జరుగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు