Karimnagar : కరీంనగర్‌‌లో కారు బీభత్సం, మృతుల కుటుంబాలకు తక్షణ సాయం రూ. 10 వేలు

మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కారు యజమాని కచ్చకాయల రాజేంద్రప్రసాద్‌తోపాటు..

Karimnagar : కరీంనగర్‌‌లో కారు బీభత్సం, మృతుల కుటుంబాలకు తక్షణ సాయం రూ. 10 వేలు

Karimnagar Car Accident Case

Karimnagar Car Accident : మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ప్రభుత్వం చెప్తున్నా కొందరు తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. అతిగారాబంతో వాహనాలు చేతికివ్వడం వల్ల వారు అడ్డగోలుగా నడిపి ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. కరీంనగర్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమే ఇందుకు తాజా ఉదాహరణ. స్నేహితులతో కలిసి కారు నడిపిన ఓ బాలుడు అతివేగంతో వెళ్తూ రోడ్డు పక్కన మహిళలపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకొన్న మంత్రి గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ విచారం వ్యక్తం చేశారు.

Read More : Ram Charan-Sreeja: ముంబై నుండి శ్రీజ ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరుగుతుంది?

మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కారు యజమాని కచ్చకాయల రాజేంద్రప్రసాద్‌తోపాటు కారులోని ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొన్నట్టు కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రమాద సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ కారుపై 9 అతివేగం చలానాలు ఉన్నట్టు తెలిసింది. ఇటు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం వద్ద ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఆటో-బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Read More : Punjab Congress : రాహుల్ పాకెట్‌‌ను ఎవరు దొంగిలించారు ? హర్ సిమ్రత్ కౌర్ ట్వీట్

కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటనలో కూలీనాలీ చేసుకుని రోడ్డుపక్కన బతికే పేదల జీవితాలు ఛిద్రమయ్యాయి. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సీత, జ్యోతి, రాణి, లలితగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన TS02EY2121 నెంబర్ గల కారుపై 7 ఓవర్ స్పీడ్ జరిమానాలు ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ పేరుతో కారు రిజిస్ట్రేషన్‌ ఉంది. పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. కారు యజమాని రాజేంద్రప్రసాద్ కొడుకు వర్దన్ కారు నడిపాడినట్లు, ఇతనికి 14 ఏళ్లు మాత్రమే ఉంటాయని నిర్ధారించారు. సరిగా డ్రైవింగ్ రాకపోవడంతో.. ప్రమాదం జరిగిందని అర్థమౌతోంది. వర్దన్ తో పాటూ మరో ఇద్దరూ మైనర్లు కారులో ఉన్నట్లు సమాచారం. బ్రేక్ కు బదులు.. క్లచ్ తొక్కడంతో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్..కొడుకు వర్దన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మైనర్లు పరారీలో ఉన్నారు.