Site icon 10TV Telugu

Mahesh Goud: కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది.. సొంత లాభం చూసుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గ్రూపులే- మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Goud

Mahesh Goud: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పిందన్నారు. ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి అప్పుల పాలు చేశారని కమిషన్ తేల్చి చెప్పిందన్నారు. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినకుండా తన సొంత లాభం మాత్రమే చూసుకున్నారని ఆరోపించారు. తనకి ఇష్టం ఉన్న చోట ప్రాజెక్ట్ కట్టాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మహేశ్ గౌడ్ తెలిపారు.

”రెండే పిల్లర్లు కుంగాయని అంటున్నారు. ఇది సామాన్య విషయమా..? ఈ కార్ రేస్ లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా..? ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్ళు కక్కక తప్పదు. ఇతర ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్న నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ప్రతిపక్షాలు చేసిన కుట్రలతోనే ఇలా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు సహజం. పార్టీలో గ్రూపులు ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే గ్రూపులే.

ఎన్ని గ్రూపులు ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి అందరూ ఒక్కటై పార్టీ కోసం పోరాడాలి. గ్రూపుల వల్ల పార్టీకి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మాది. పార్టీలో పాత నీరుతో పాటు కొత్త నీరు కూడా ఉండాలి. పాత కొత్త కలయికలతో పార్టీ ధృఢంగా ఉంటుంది. సుతి లేని సంసారం చేసి 8 లక్షల కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ కుటుంబం అంటే అబద్ధాల పుట్ట. మీ చేతకానితనం వల్ల బనకచర్ల ప్రాజెక్ట్ వస్తోంది. మేము మేల్కొని ఫిర్యాదు చేస్తే ప్రాజెక్ట్ పనులు ఆగాయి” అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Also Read: మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్.. పీసీసీ చీఫ్‌ రివర్స్‌ గేమ్

Exit mobile version