Telangana Congress : బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పలువురు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు

మరో రెండుమూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నవేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Telangana Congress Party

BRS Party : మరో రెండుమూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నవేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వెంకటేష్ నేత గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఆయనతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డితోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read : ఆ రెండు కులాలకే ఎమ్మెల్యే ఛాన్స్‌..! రామచంద్రపురంలో ఆసక్తికర రాజకీయం

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎంపీ సహా పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం అనిచెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాగా మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మన్నే జీవన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తరువాత రేవంత్, భట్టి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంకు వెళ్లారు. అనంతరం, ఎంపీ వెంకటేష్ నేత, మన్నే జీవన్ రెడ్డితోపాటు పలువురు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలకు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వీరు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటేశ్ నేత, మన్నే జీవన్ రెడ్డిలను ఖర్గే అభినందించారు.

బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. 2018లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలోచేరి పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. అయితే, ఈసారి పెద్దపల్లి ఎంపీ టికెట్ వెంకటేశ్ నేతకు కాకుండా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. టికెట్ దక్కదనే ఆలోచనతోనే వెంకటేశ్ నేత పార్టీ మారారని భావిస్తున్నారు.

Also Read : పవన్ కల్యాణ్‌కు సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు ప్రకటించగలరా? చేగొండి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు

ఇదిలాఉంటే.. రాంచీ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సోనియాగాంధీకి వారు వివరించారు. ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ పథకాల అమలుతో పాటు వివిధ అంశాలపై సోనియా దృష్టికి తీసుకెళ్లారు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని వారు సోనియాగాంధీని కోరినట్లు తెలిసింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు