Corona awareness : మా ఇంటికి రాకండి..మీ ఇంటికి రానీయకండి

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రజల్లోఎవేర్ నెస్ పెరిగిపోయింది. దయచేసి మాఇంటికి రాకండి... మీ ఇంటికి రానివ్వకండి అని విజ్ఞప్తి చేస్తూ ఇంటి ముందు బ్యానర్లు కట్టకుంటున్నారు. ఇలాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

People awareness on Coronavirus : కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. చాలా మంది అత్యవసరం అయితేనే తప్పబయటకు రావటంలేదు. ప్రజల్లోఎవేర్ నెస్ పెరిగిపోయింది. దయచేసి మాఇంటికి రాకండి… మీ ఇంటికి రానివ్వకండి అని విజ్ఞప్తి చేస్తూ ఇంటి ముందు బ్యానర్లు కట్టకుంటున్నారు. ఇలాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తెలంగాణలోని రామగుండం కార్పోరేషన్ పరిధిలో 31వ డివిజన్ లోని వాసులు తమ ఇళ్లముందు కరోనాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. కలిసికట్టుగా పోరాడుదాం.. కరోనా మహమ్మారిని ఖతం చేద్దాం.. మాస్క్‌ ధరిద్దాం, భౌతికదూరం పాటిద్దాం’అంటూ తమ ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నిక్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి అనుచరులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే  కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని …..  ‘నాతో పని ఉందా.. అయితే సెల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయండి. ఎన్నికల ప్రచారమా.. కరపత్రాలు పక్కన బ్యాగులో వేసి వెళ్లండి. ఇంట్లోకి మాత్రం రావద్దు..’అంటూ తాళం వేసిన ఇంటిగేటుకు బోర్డు పెట్టాడు ఓ వ్యక్తి. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ఈపని చేసినట్లు హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న క్రాంతి అనే వ్యక్తి చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు