Vivek
BJP Leader Vivek: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రజలు నమ్మటం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం తిరుమల తిరుపతి శ్రీవారిని వివేక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్‌తో సంబంధం పెట్టుకోబోమని గతంలో మంత్రి కేటీఆర్ చెప్పాడని, నాలుగు నెలల్లోనే ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకున్నారంటే టీఆర్ఎస్ గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవచ్చునన్నారు. పీకే రాకతోనే సీఎం కేసీఆర్ ఓడిపోయినట్లే అని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు.
Telangana BJP : ఎన్ని పార్టీలు ఏకమైనా మోదీని ఏమి చేయలేరు
రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, ప్రజల సమస్యలు పక్కన పెట్టి కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కేసీఆర్ కృషి చేశాడని వివేవ్ విమర్శించారు. ప్రజలందరూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని, జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం అని అన్నాడు. కుటుంబ పాలనకు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు సిద్ధమైనట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రశాంత్ కిషోర్ వ్యవహారాలు తెలిసిందేనని, ప్రశాంత్ కిషోర్ న్యాయం, ధర్మం వైపు ఉండాలని వివేక్ సూచించారు. ప్రశాంత్ కిషోర్ వచ్చినా, కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ వివేక్ ఆశాభావం వ్యక్తం చేశారు.