గుండు గీయించుకుంటే కరోనా రాదా? నిజమెంత

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తుందో

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తుందో

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. కాగా, కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఎన్నో వదంతులు, ఫేక్ వార్తలు, మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఎక్కువగానే వ్యాప్తి చెందుతున్నాయి. ఇలా చేస్తే కరోనా రాదు, అలా చేస్తే కరోనా రాదు అనే ఫేక్ వార్తలు అనేకం సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఓవైపు అలాంటి ఫేక్ వార్తలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినా, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని డాక్టర్లు కోరుతున్నా ప్రజలు తప్పుడు సమాచారాన్నే ఎక్కువగా నమ్ముతున్నారు, వాటినే ఆచరిస్తున్నారు.

గుండు కొట్టించుకున్న 25మంది యువకులు:
ఇటీవలే జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఒక్క కొడుకు ఉన్న వారు ఐదు ఇళ్ల బావుల్లోని నీటిని వేపచెట్టుకు పోస్తే కరోనా పారిపోతుందనే వింత ప్రచారం మొదలైంది. దీన్ని ఆ ప్రాంతంలో చాలా మంది పాటించారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ప్రజలు గుండుకొట్టించుకుంటున్నారు. ఇలా చేస్తే కరోనా రాదన్న ప్రచారం మొదలైంది. ముధోల్ మండలం చింతకుంట తండాలో 25మంది యువకులు కులదైవానికి పూజలు చేసి, గుండు చేయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు గుండు కొట్టించుకుని ఫొటోలు కూడా దిగారు. ఇలా చేస్తే కరోనా రాదని వారు ఎంతో నమ్మకంగా చెప్పడం గమనార్హం.

అందుకే గుండు గీయించుకుంటున్నారట:
ఇలా చేస్తే తమ గ్రామంలోనూ కరోనా రాదని ఓ గ్రామ పెద్ద మీడియాకు తెలిపాడు. హిందూ సంప్రదాయం ప్రకారం పుణ్య క్షేత్రాలకు వెళ్లినా, ఇంట్లో ఎవరైనా చనిపోయినా గుండు చేయించుకుంటామని, అదే ఆచారం ప్రకారం కరోనా రాకుండా ఇప్పుడు గుండు చేయించుకుంటున్నామని చెప్పాడు. కుల దైవాలకు భక్తి, శ్రద్ధలతో పూజలు కూడా జరిపించామని తెలిపాడు. ఇష్ట దైవాలకు తల వెంట్రుకలు ఇస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని ఆయన వివరించడం విశేషం.

కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతే మార్గం:
దీనిపై అధికారులు, వైద్య నిపుణులు స్పందించారు. ఇదంతా ట్రాష్ అన్నారు. గుండు గీయించుకుంటే కరోనా రాదు అనే దానిలో వాస్తవం లేదన్నారు. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని చెప్పారు. కరోనాపై ప్రపంచవ్యాప్తంగా ఇంకా అధ్యయనం జరుగుతోందన్నారు. కరోనా గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వ్యాక్సిన్ తయారీకి సైంటిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సైన్స్ పరంగా ఆలోచన చేయాలి కానీ ఇలా మూఢ నమ్మకాలను ఫాలో అవడం కరెక్ట్ కాదంటున్నారు. అధికారులు స్పందించి ఆ గ్రామానికి వెళ్లి వారిలో చైతన్యం నింపాలన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రస్తుతానికి స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం తప్ప మరో మార్గమే లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు