Siddipet Train: పరుగులు పెట్టిన సిద్దిపేట ప్రజల కలల రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే ఆయన సిద్దిపేట రైలును ప్రారంభించారు. ఇక దీనితో పాటు రాష్ట్రంలో సుమారు రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేశారు, ప్రారంభించారు.

Siddipet to Secundrabad Train: సిద్దిపేట ప్రాంత ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన రైలు సర్వీసు ఎట్టకేలకు ప్రారంభమైంది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలుకు వర్చువల్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే ఆయన సిద్దిపేట రైలును ప్రారంభించారు. ఇక దీనితో పాటు రాష్ట్రంలో సుమారు రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

సికింద్రాబాద్‌-మన్మాడ్‌ వెళ్లే మార్గంలో మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి రైల్వేలైన్‌ ప్రారంభమై సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌, సిద్దిపేట మీదుగా రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి.. అక్కడి నుంచి కరీంనగర్‌ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి-నిజమాబాద్‌ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద ఈ లైన్‌ కలుస్తుంది. నాలుగైదు దశల్లో పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేసి ఆ దిశగానే పనులు ముమ్మరం చేశారు. ఈ రైల్వేలైన్‌ నిర్మాణం మెదక్‌ జిల్లాలో 9.30 కి.మీ., సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీ., రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్‌ జిల్లాలో 20.86 కిలోమీటర్లు, మొత్తం 151.36 కిలోమీటర్ల రైల్వేలైన్‌ నిర్మాణం చేస్తారు. నాలుగు జిల్లాల్లో మొత్తం 15 రైల్వే స్టేషన్లు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు.

ఈ మొత్తం సెక్షన్ లో భాగంగా మనోహరాబాద్-సిద్దిపేట రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేసుకుని మంగళవారం తొలి రైలు పరుగులు తీసింది. దశాబ్దాల సిద్ధిపేట ప్రజల కల సాకారమైనందుకు తనకు సంతోషంగా ఉందని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.

Also Read: తెలంగాణలో రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ