PM Modi in Nizamabad: తెలంగాణలో రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
సిద్ధిపేట-సికింద్రాబాద్ వరకు నిర్మించిన నూతన రైల్వే లైనును మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం నుంచే మొదటి రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన సూపర్ థర్మల్ పవర్ ప్లాంటును జాతికి అంకితం చేశారు.

PM Modi in Nizamabad: తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు, అలాగే కొన్నింటిని ప్రారంభించారు. వస్తవానికి అక్టోబర్ 1వ తేదీ (ఆదివారం) మహబూబ్ నగర్ లో జరిగిన సభలోనే సుమారు 13,000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేసిన ఆయన.. మంగళవారం నిజామాబాద్ లో జరిగిన సభలో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టారు.
సిద్ధిపేట-సికింద్రాబాద్ వరకు నిర్మించిన నూతన రైల్వే లైనును మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం నుంచే మొదటి రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన సూపర్ థర్మల్ పవర్ ప్లాంటును జాతికి అంకితం చేశారు. తెలంగాణలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.