MP Venkatesh : తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన ప్రధాని మోదీ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారు : ఎంపీ వెంకటేష్

ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించి మోసం చేశారని వెల్లడించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలేదని విమర్శించారు.

MP Venkatesh

Venkatesh Comments Modi : ప్రధాని నరేంద్ర మోదీపై ఎంపీ వెంకటేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టారని ఎంపీ వెంకటేష్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో వస్తున్న స్పందనను చూసి మోదీ ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. మోదీ అన్ని అబద్ధాలు, అసత్యాలు పలుకుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిరంతర కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళుతుందన్నారు.

ఆర్ధికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసారి ఆదాయం 87 శాతం ఎక్కువన్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పారు. రాష్ట్ర పుట్టుకపై విషం చిమ్మిన ప్రధాని మోదీ.. అడుగు అడుగునా రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు.

KTR: ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోవాలని అన్నారు.. ఇప్పుడేమో ఇక్కడకు వచ్చి..: కేటీఆర్

ఎన్ని అవమానాలు, అవహేళన చేసినా సీఎం కేసీఆర్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నదీ జలాలపై వివాదాన్ని కేంద్రం ఇంకా తేల్చడం లేదని వెల్లడించారు. కాళేశ్వరంకు జాతీయ హోదా కోసం వేడుకున్నా స్పందించ లేదన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నామని తెలిపారు. ప్రధాన ప్రాజెక్టును గుజరాత్ కు తరలించి, రూ.520 కోట్ల ప్రాజెక్టు ఇక్కడికి ఇస్తావా అని మండిపడ్డారు.

ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించి మోసం చేశారని వెల్లడించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలేదని విమర్శించారు. అదానీకి 8 ఎయిర్ పోర్టులను ప్రధాని మోదీ అక్రమంగా కట్టబెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. దేశాన్ని నియంతలా పాలించాలన్నదే మోదీ లక్ష్యమన్నారు. బీజేపీ ద్రోహులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.