PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఖరారు.. ఏఏ జిల్లాల్లో పర్యటిస్తారంటే? పూర్తి షెడ్యూల్ ఇలా..

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. రెండు జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

PM Modi

PM Modi Telangana Tour : పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రచార పర్వానికి తెరలేపారు. మరోవైపు నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై  బీజేపీ అధిష్టానం దృష్టిసారించింది. తొలి విడత జాబితాను వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేసేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటనలకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్చి మొదటి వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు.

Also Read : Chalo Medigadda : చలో మేడిగడ్డ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కౌంటర్ అటాక్

మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారు. రెండ్రోజులపాటు అదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తారు. 4వ తేదీన అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న ప్రధాని.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేరోజు అదిలాబాద్ జిల్లాలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగింస్తారు. మరుసటి రోజు (మార్చి 5న) సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.

Also Read : బండి సంజ‌య్‌పై మంత్రి పొన్నం ఫైర్.. రాముని పేరుతో గెలవాలని చూస్తే ప్రజలే బుద్దిచెబుతారు

  • ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా.. 
  • మార్చి4వ తేదీ  ఉదయం 9:20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో నాగపూర్ చేరుకోనున్న నరేంద్ర మోదీ.. అక్కడినుండి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 10.20 నిమిషాలకు ఆదిలాబాద్ కు చేరుకుంటారు.
  • ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు అధికారిక కార్యక్రమంలో నరేంద్ర మోదీ పాల్గొంటారు.
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు.
  • ఉదయం 11.05 నుండి 12.00 వరకు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
  • బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తమిళనాడు వెళ్తారు.
  • రాత్రి 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
  • రాత్రి 8.00 గంటలకు రాజ్ భవన్ కు చేరుకొని అక్కడే మోదీ బస చేస్తారు.
  • 5వ తేదీ పర్యటన వివరాలు  ..
  • 5వ తేదీన ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలుదేరి.. బేగంపేట విమానాశ్రయంకు వెళ్తారు. అక్కడి నుంచి సంగారెడ్డికి బయలుదేరుతారు.
  • 10:40 నిమిషాలకు సంగారెడ్డికి చేరుకుంటారు.
  • 10:45 నుండి 11:15 నిమిషాల వరకు అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు పూర్తయిన  ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేస్తారు.
  • ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12: 45 నిమిషాల వరకు పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
  • సంగారెడ్డి బహిరంగ సభ అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 12: 55 కు చేరుకుంటారు.
  • బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఒడిస్సాకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు