బండి సంజ‌య్‌పై మంత్రి పొన్నం ఫైర్.. రాముని పేరుతో గెలవాలని చూస్తే ప్రజలే బుద్దిచెబుతారు

కరీంనగర్ ఎంపీగా గెలిచి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడో చెప్పు అంటూ పొన్నం ప్రశ్నించారు.

బండి సంజ‌య్‌పై మంత్రి పొన్నం ఫైర్.. రాముని పేరుతో గెలవాలని చూస్తే ప్రజలే బుద్దిచెబుతారు

Bandi Sanjay and Ponnam Prabhakar

Ponnam Prabhakar : బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాముని పేరుతో కోట్ల రూపాయలు అడుక్కునే మీరు దొంగలు.. నేను ఏనాడైనా అడిగి ఉన్నట్లయితే నేను సజీవ దహనం చేసుకుంటా. మీ అమ్మకు పుట్టినావా అంటూ నువ్వే మాట్లాడి.. నన్ను అమ్మ పేరుతో రాజకీయం చేస్తున్నావా అంటావా? బతికున్న మా అమ్మను ఉద్దేశిస్తూ.. మీ అమ్మ ఆత్మ గోషిస్తుందని అంటావా.. ఇప్పుడు మా అమ్మ కాళ్లకు మొక్కుతా అని దొంగ కన్నీరు పెడుతా అంటూ బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.

Also Read : PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఖరారు.. ఏఏ జిల్లాల్లో పర్యటిస్తారంటే?

కరీంనగర్ ఎంపీగా గెలిచి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడో చెప్పు అంటూ పొన్నం ప్రశ్నించారు. హిందువు అని చెప్పుకుంటున్నావుగా.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేశావా బండి సంజయ్ అంటూ మంత్రి పొన్నం ప్రశ్నించారు. మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టుడుతప్ప నియోజకవర్గంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏమీలేదని పొన్నం విమర్శించారు. నువ్వు నా తల్లి గురించి మాట్లాడావు.. నా తల్లి ఏడుస్తుంది.. ఆమె గోస నీకు తగులుతుంది అంటూ మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Prajahita Yatra: బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. మంత్రి పొన్నం ఏమన్నారంటే?

హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద బతికున్న మా అమ్మను పట్టుకుని తప్పుగా మాట్లాడావు.. మా అమ్మ గోసిస్తుంది. భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీచేశా అంటున్నావు.. నీకు పుస్తెల విలువ తెలుసా సంజయ్ అంటూ పొన్నం ప్రశ్నించారు. పోయినసారి హిందువు పేరుతో రాజకీయం చేసి గెలిచావు.. ఇప్పుడు రాముని పేరుతో గెలవాలని చూస్తే ప్రజలే బుద్దిచెబుతారు సంజయ్ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.