PM Modi : సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

PM Modi

Ujjaini Mahankali Temple : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని మోదీకి అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకొని, అక్కడి నుంచి సంగారెడ్డి పర్యటనకు వెళ్లారు.