Narendra Modi (Photo : Twitter)
Narendra Modi – Telangana Tour : ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. ప్రధాని తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 8న ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కు రానున్నారు. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు.
Also Read..KCR: సీఎం కేసీఆర్.. మహారాష్ట్రపై ఎందుకు ఎక్కువగా ఫోకస్ పెట్టారంటే..!
అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. 200 ఎకరాల్లో రూ.10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని తెలంగాణ పర్యటన ముందుగా జూలై 12న అని అనుకున్నారు. అయితే, దీన్ని రీ-షెడ్యూల్ చేశారు. 8వ తేదీనే ప్రధాని మోదీ రాబోతున్నారు. వరంగల్ లో అధికారిక పర్యటనలో ప్రధాని పాల్గొంటారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని బహిరంగ సభకు రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా కేవలం అధికారిక పర్యటనకే పరిమితం చేయాలని అనుకున్నారు.
అయితే, దీన్ని పార్టీ బలోపేతానికి కూడా వినియోగించుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే పార్టీ పరంగా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ 8న వరంగల్ కు రావడానికి ప్రధాన కారణం మెగా టెక్స్ టైల్ పార్క్. దీనికి శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో 7 మెగా టెక్స్ టైల్ పార్కులను కేంద్రం అనౌన్స్ చేసింది. అందులో వరంగల్ లో ఒకటి రానుంది. దానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా కాజీపేటలో రైల్వేశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు(టెక్స్ టైల్ పార్క్, వ్యాగర్ ఓవర్ హాలింగ్ సెంటర్) కూడా అధికారిక కార్యక్రమాలే.
Also Read..KTR: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్
ప్రధాని మోదీ పర్యటనను పార్టీకి ప్రయోజనం కలిగేలా చూసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే అధికారిక పర్యటన పూర్తయ్యాక పార్టీ పరంగా ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బహిరంగ సభ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. బహిరంగ సభ కోసం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ ను ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు సమాచారం. దాదాపు లక్ష మందితో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.