Podem Veeraiah : భద్రాచలంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాసా.. రేగా కాంతారావు మాట్లాడకుండా మైక్ లాక్కున్న పొదెం వీరయ్య

వెనుకబడిన తరగతుల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడకుండా ఎమ్మెల్యే పొదెం వీరయ్య అడ్డుకున్నారు.

Podem Veeraiah - Rega Kantharao

Podem Veeraiah – Rega Kantharao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అధికార బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. వెనుకబడిన తరగతుల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడకుండా ఎమ్మెల్యే పొదెం వీరయ్య అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రభుత్వం విప్ రేగా కాంతారావు చేతిలో మైక్ ను లాక్కున్నారు. ఏట్టి పరిస్థితుల్లో రేగా కాంతారావుని మాట్లాడ నివ్వనని ఎమ్మెల్యే వీరయ్య పంతం పట్టారు. మరోవైపు రేగా కాంతారావు మాట్లాడాలి అంటూ అధికార పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

Malkajgiri: మల్కాజిగిరి బరి నుంచి మైనంపల్లిని తప్పించడం ఖాయమా?

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు తెలంగాణలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.