×
Ad

Hyderabad : ఓరి మీ దుంపలు తెగ.. మళ్లీ పెళ్లికోసం ఇదేం పాడుపనిరా..? పోలీసులు ఎంట్రీతో దిమ్మతిరిగిపోయింది..

Hyderabad : విడాకులు తీసుకున్న ఓ జంట మళ్లీ పెళ్లికోసం పెద్ద డ్రామా ఆడారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా ..

Hyderabad

Hyderabad : విడాకులు తీసుకున్న ఓ జంట మళ్లీ పెళ్లికోసం పెద్ద డ్రామా ఆడారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవడానికి పథకం వేసిన ఆ జంట.. ఏకంగా ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు. చివరికి పోలీసులు ఎంట్రీతో వారి గుట్టు బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హకీంపేట్ కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఫయాజ్ (25) గోల్కొండకు చెందిన సల్మాబేగం అలియాస్ సమ్రీన్ (24) ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే, కొద్దికాలంకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. విడాకులుసైతం తీసుకున్నారు. ఆ తరువాత ఫయాజ్ హకీంపేట్ లో ఉంటూ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే, కొన్నాళ్లకే మొదటి భార్యతో మళ్లీ మాటలు కలిశారు. రెండేళ్లుగా ఫయాజ్ తన మొదటి భార్య సల్మా బేగంను తరచూ కలుసుకుంటున్నాడు. కొద్దికాలం క్రితం వారిద్దరూ మళ్లి పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ, అందుకు ఫయాజ్ కుటుంబసభ్యులు ససేమీరా అన్నారు. అయితే, వారికి పెళ్లికి ఒప్పించేందుకు ఫయాజ్, సమ్రీన్ పెద్ద డ్రామానే ఆడారు.

Also Read: Eggs : కోడిగుడ్లు తినేవారికి బిగ్ అలర్ట్.. ఫౌల్ట్రీఫామ్‌లకు జరిగిన నష్టం కూడా అందుకు కారణమే..!

ఫయాజ్ తన తల్లిదండ్రులను సల్మాబేగంతో మళ్లీ పెళ్లికి ఒప్పించేందుకు .. తమకు విడాకులైన సమయంలో సల్మాబేగం గర్భతి అని, ఆ తరువాత ఆమెకు ఆడపిల్ల పుట్టిందని నమ్మించాడు. తనతో మళ్లీ పెళ్లికి ఒప్పుకోవాలని వారిపై ఒత్తిడి తెచ్చాడు. ఆ తరువాత ఓ పాపను కిడ్నాప్ చేసి సల్మాబేగం, తనకు పెట్టిన బిడ్డగా చూపించేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం సల్మాబేగం గోల్కొండ సాలేనగర్ లోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న సఫియాబేగం అనే నాలుగేళ్ల చిన్నారని మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లారు. సల్మాబేగంతోపాటు ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతడి రెండో భార్య పుట్టింటికి వెళ్లింది. అదేరోజు సాయంత్రం కిడ్నాప్ కు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ నాలుగేళ్ల కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.

చిన్నారి ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చిన్నారి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉండగా ఫయాజ్ తో పాటు సల్మాబేగంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే ఇంట్లో ఉన్న నాలుగేళ్ల చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సల్మాబేగం, ఫయాజ్ ను అదుపులోకి తీసుకొని.. ఆటోను, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.