Eggs : కోడిగుడ్లు తినేవారికి బిగ్ అలర్ట్.. ఫౌల్ట్రీఫామ్‌లకు జరిగిన నష్టం కూడా అందుకు కారణమే..!

Eggs : కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. కానీ, ప్రస్తుతం కోడిగుడ్లు తినేవారికి..

Eggs : కోడిగుడ్లు తినేవారికి బిగ్ అలర్ట్.. ఫౌల్ట్రీఫామ్‌లకు జరిగిన నష్టం కూడా అందుకు కారణమే..!

Eggs

Updated On : November 24, 2025 / 8:38 AM IST

Eggs Price : కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి. దీని వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. గుడ్డు త్వరగా అరుగుతుంది కాబట్టి దీన్నీ చాలా మంది బ్రేక్‌ఫాస్ట్, లేదంటే స్నాక్స్‌గా తినడానికి ఇష్టపడతారు.

ప్రతీ ఇంట్లో వారంలో ఒకరోజు మాంసాహారం వండుకున్నా.. కనీసం మూడు, నాలుగు రోజులు కోడిగుడ్డుతో వంటకం తప్పనిసరి. అటు మాంసాహారులకు ఇటు పలువురు శాకాహారులకు కూడా కోడిగుడ్లే ప్రత్యామ్నాయ, ఇష్టమైన ఆహారం. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కోడిగుడ్డు ధర (Eggs Price) లు కొండెక్కి కూర్చున్నాయి. నెల క్రితం రూ.5కే వచ్చిన గుడ్డు.. ఇప్పుడు రూ.8కి చేరింది.

కోడి గుడ్డు ధరలు ఒక్కైసారిగా పెరిగిపోయాయి. గత నెలలో రూ.5 నుంచి రూ.6 విక్రయించగా.. ప్రస్తుతం రూ.7 నుంచి రూ. 8వరకు అమ్ముతున్నారు. దీంతో వినియోగదారులు కొనేందుకు ఆలోచిస్తున్నారు. ఓవైపు కూరగాయల ధరలు పెరగ్గా.. ఇప్పుడు కోడిగుడ్డు ధరతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ కు తగ్గట్టు సరఫరా లేకపోవడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

Also Read : Dense Fog : బిగ్ అలర్ట్.. పొగమంచులో వాహనం నడుపుతున్నారా..? మీరు ఈ సూచనలు పాటించాల్సిందే.. పోలీసులు ఏం చెప్పారంటే?

ప్రతీయేటా చలికాలంలో ఉత్తరాదికి కోడిగుడ్ల ఎగుమతి పెరుగుతుంది. అదే సమయంలో మొంథా తుపాన్ కారణంగా పౌల్ట్రీఫామ్‌లకు జరిగిన నష్టం కూడా ధరల పెరుగుదల కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు డిమాండ్‌ను బట్టి రూ.8 అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఓ పక్కన పెరిగిన కూరగాయల ధరలతో కలవర పడుతుంటే గుడ్డు ధరలు కూడా వేగంగా పెరుగుతుండడంతో సామాన్యులకు షాక్ తగులు తోంది.

హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో 673కు చేరింది. ఉత్తర భారతంలో చలితో గుడ్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఎగుమతులు ఊపందుకున్నాయి. ఇటీవల ఏపీ, తెలంగాణలో వ్యాధులతో పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయి గుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో కోడి గుడ్ల ధర కొండెక్కిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కోడి గుడ్ల ఉత్పత్తి లో దేశంలోనే మొదటిరెండు స్థానాలూ ఏపీ తెలంగాణవే. ఉత్పత్తిలోనే కాదు, విని యోగంలో తెలుగు రాష్ట్రా లదే అగ్రస్థానం. వచ్చే రెండు, మూడు వారాల్లో డజను గుడ్లు సెంచరీ కొట్టే అవకాశం కూడా ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.