Dense Fog : బిగ్ అలర్ట్.. పొగమంచులో వాహనం నడుపుతున్నారా..? మీరు ఈ సూచనలు పాటించాల్సిందే.. పోలీసులు ఏం చెప్పారంటే?

Dense Fog : శీతాకాలం తెల్లవారుజామునుంచే మంచు తెరలు కప్పేస్తున్నాయి. రోడ్లపై వాహనాలు కనిపించనంతగా పొగమంచు చుట్టేస్తోంది.

Dense Fog : బిగ్ అలర్ట్.. పొగమంచులో వాహనం నడుపుతున్నారా..? మీరు ఈ సూచనలు పాటించాల్సిందే.. పోలీసులు ఏం చెప్పారంటే?

Dense Fog

Updated On : November 24, 2025 / 8:13 AM IST

Dense Fog : శీతాకాలం తెల్లవారుజామునుంచే మంచు తెరలు కప్పేస్తున్నాయి. రోడ్లపై వాహనాలు కనిపించనంతగా పొగమంచు చుట్టేస్తోంది. ఈ సమయంలో వాహనదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పణంగా పెట్టినట్లే. పోలీసుల రికార్డుల ప్రకారం.. శీతాకాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట. ఇందులో చాలా వరకు ప్రమాదాలు అర్ధరాత్రి తరువాత నుంచి ఉదయం ఏడు గంటలలోపు ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. పొగమంచు కమ్మేసిన సమయంలో జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నది. ఇందులో భాగంగా పొగమంచు సమయంలో, రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తోంది.

వాహనం నడిపేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
♦ పొగమంచు వల్ల ప్రయాణాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. నిర్ణీత సమయం కంటే ముందుగానే బయలుదేరాలి.
♦ తెల్లవారుజామున మంచులో అతివేగంగా డ్రైవ్ చేయడం, ఓవర్ టేకింగ్ చేయడం ప్రమాదకరం.
♦ హైబీమ్ లైట్ల నుంచి వచ్చే కాంతి విచ్ఛిన్నమై, ఎదురుగా చూడటం మరింత కష్టమవుతుంది. కాబట్టి, తప్పనిసరిగా లోబీమ్ హెడ్లై లైట్లను మాత్రమే వాడండి. ఫాగ్ లైట్లు ఉంటే ఉపయోగించాలి.
♦ ముందు ఉన్న వాహనానికి, మీ వాహనానికి మధ్య తగినంత దూరాన్ని పాటించాలి. దీనివల్ల ముందు వాహనం సడన్ బ్రేక్ వేసినా, అదుపు తప్పినా దాన్ని ఢీకొట్టకుండా నివారించవచ్చు.
♦ నిర్దేశించిన లేన్లలో మాత్రమే వాహనాన్ని నడపాలి. వాహనం నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దించడం వల్ల పొగమంచు కేంద్రీకృతం కాదు. దీని వల్ల రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది.
♦ పొగమంచు ఉండి, రోడ్డు కనిపించకపోతే వాహనాన్ని ఆపాలి. మంచు తగ్గిన తరువాత బయలుదేరాలి.
♦ ఇండికేటర్లను తప్పనిసరిగా వినియోగించాలి. పార్కింగ్ లైట్లు వేసుకుంటే ఇతర వాహనదారులకు స్పష్టంగా తెలుస్తుంది.

Also Read: IBomma Ravi : ఐబొమ్మ రవి కేసు.. ఫ్రెండ్‌కు పెట్టిన ఆ ఒక్క మెసేజ్‌తో.. పోలీసుల చేతికి చిక్కాడిలా..!