Congress Leader: మహిళపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ నేత జ్ఞానేశ్వర్ అరెస్ట్

మహిళపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుడు(Congress Leader) కంది జ్ఞానేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Police arrested Congress leader Kandi Gnaneshwar on allegations of sexually harassing and raping a woman

  • కాంగ్రెస్ నేత జ్ఞానేశ్వర్ అరెస్ట్
  • మహిళపై మత్తుమందుతో అత్యాచారం
  • భారీగా డబ్బులు బ్లాక్‌మెయిల్

Congress Leader: హైదరాబాద్ నగరంలో దారుణం వెలుగుచూసింది. మహిళపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుడు(Congress Leader) కంది జ్ఞానేశ్వర్‌ను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టారు.

Jupally Krishna Rao: అవినీతి జరిగితే ముక్కు నేలకు రాస్తా.. బావ బామ్మర్ది ఇద్దరూ రావాలి.. గన్ పార్క్ వద్ద జూపల్లి సంచలన కామెంట్స్

పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు కంది జ్ఞానేశ్వర్ సదరు మహిళకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను మొబైల్‌లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత ఆ అసభ్య వీడియోలను బాధితురాలికి చూపిస్తూ, సోషల్ మీడియాలో పెడతానంటూ తీవ్రస్థాయిలో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.

నిందితుడి వేధింపులు, బెదిరింపులకు భయపడిన బాధితురాలు ఇప్పటివరకు విడతల వారీగా దాదాపు రూ. 50 లక్షల వరకు నగదు చెల్లించింది. అయినప్పటికీ జ్ఞానేశ్వర్ నుంచి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో, ఆమె తట్టుకోలేక చివరకు చందానగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కంది జ్ఞానేశ్వర్‌ను తక్షణమే అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.