MLA Rajasingh: బుల్లెట్ ఫ్రూప్ వాహనంతో ప్రగతిభవన్‌కు రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన వెంట తెచ్చిన వాహనాన్ని రాజాసింగ్ అక్కడే వదిలేసి వెళ్లే ప్రయత్నంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని ప్రగతి భవన్ వద్దకు రాజాసింగ్ తీసుకొచ్చాడు. పోలీసులు రాజాసింగ్‌ను అడ్డుకోవటంతో తన వెంట తీసుకొచ్చిన బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని ప్రగతి భవన్ ముందు వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

MLA Rajasingh Notice : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

గురువారం అసెంబ్లీ నుంచి వెళ్తున్న క్రమంలో రాజాసింగ్ బుల్లెట్ ఫ్రూప్ వాహనం ఆగిపోయింది. వాహనం వేగంగా వెళ్తున్న క్రమంలో ముందు చక్రం ఊడిపోయింది.  తృటిలో రాజాసింగ్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  దీంతో రాజాసింగ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన బుల్లెట్ ఫ్రూప్ వాహనం పాడవుతుందని ఎన్నిసార్లు చెప్పినా తిరిగి అదే బండి కేటాయిస్తున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన వాహనాన్ని మార్చాలని, లేదంటే మీ వాహనం మీరు తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారు.

Raja Singh: ఊడిపోయిన కారు చక్రం.. ఎమ్మెల్యే రాజా సింగ్‌కు తప్పిన ప్రమాదం

తనవద్ద ఉన్న బుల్లెట్ ఫ్రూప్ వాహనం పదేపదే చెడిపోతుందని, వాహనాన్ని మార్చాలని రాజాసింగ్ పలుసార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ను కలవటానికి ప్రగతి భవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతకొతకాలంగా తనకు మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనం‌ కేటాయించాలని కోరుతున్నానని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భద్రతను అధికారులు గాలికొదిలేశారని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు