Kishan Reddy : ఇందిరాపార్క్ వద్ద కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. బీజేపీ కార్యాలయంలో కొనసాగింపు

శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఇబ్బందేంటని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని బీజేపీ ఆఫీస్ లో వదిలి వేశారు.

Kishan Reddy initiation

Kishan Reddy Initiation Broke Up : హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తోపులాటలో కిషన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఇబ్బందేంటని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని బీజేపీ ఆఫీస్ లో వదిలి వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేపట్టారు.

Kishan Reddy : తెలంగాణలో జమిలి ఎన్నికలపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

కిషన్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు, ఫొటోలను బీజేపీ పార్టీ విడుదల చేసింది. అరెస్టు చేసిన తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు చేసిన మోసాలను దీక్ష ద్వారా ఎండగడుతుంటే తట్టుకోలేకే అరెస్టులు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. రజాకార్ల పాలనకు చరమ గీతం పాడే సమయం వచ్చిందన్నారు.