రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు.. పుష్పా సినిమా సీన్లను తలదన్నేలా ఖతర్నాక్ ప్లాన్లు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. పోలీసులకు చిక్కకుండా సరికొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు.

Ganja Transportation

Ganja Transportation : గంజాయి రవాణా, విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తోంది. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసి గంజాయి రవాణా దారులపై కేసులు నమోదు చేస్తుంది. ఈ క్రమంలో స్మగ్లర్లు గంజాయి రవాణాకు కొత్త దారులు వెతుకుతున్నారు. పుష్పా సినిమాలో ఎర్రచందనం దుంగలను పోలీసుల కంటపడకుండా తరలించేందుకు కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలో ఆ సినిమాలో సీన్లను తలదన్నే స్థాయిలో.. పోలీసులకు దొరకకుండా గంజాయి రవాణాకు స్మగ్లర్లు కొత్త మార్గాలు కనుగొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ లో గంజాయిని తరలిస్తూ దొరికిపోయారు.

Also Read : Balapur Ganesh : లక్షలు కట్టాల్సిందే.. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో కొత్త నిబంధనలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. పోలీసులకు చిక్కకుండా సరికొత్త మార్గాల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. పుష్పా సినిమాలో ఎర్రచందనం దుంగలను పోలీసుల కళ్లుగప్పి కొత్తకొత్త మార్గాల్లో తరలించే సీన్లు ఉన్నాయి. ఆ సీన్లను తలన్నేలా గంజాయి స్మగ్లర్లు ఖతర్నాక్ ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా అంబులెన్సులో గంజాయి తరలింపునకు కేటుగాళ్లు తెరలేపారు. ఏఓబీ నుంచి తమిళనాడు రాష్ట్రంకు అంబులెన్స్ లో గంజాయిని తరలిస్తున్నారు. అయితే, మార్గం మధ్యలో కొత్తగూడెం వద్ద అంబులెన్స్ టైర్ పంక్చర్ అయింది. డ్రైవర్ స్థానికుల సాయం కోరడంతో టైర్ మార్చేందుకు స్థానిక యువత సాయం చేశారు. ఈ క్రమంలో అనుమానంతో అంబులెన్స్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన ఓ యువకుడికి ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లు కనిపించాయి.

Also Read : Samantha : చర్మ సౌందర్యం కోసం సమంత కష్టం.. స్కిన్ హెల్త్ కోసం పాపం సమంత ఇంత కష్టపడుతుందా..

అంబులెన్స్ వెనుక భాగంలో ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లును గుర్తించిన యువకుడు.. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేశాడు. వారి సహకారంతో యువకులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్స్ వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. విషయాన్ని గోప్యంగా ఉంచి.. డ్రైవర్ ను విచారిస్తున్నారు.