Balapur Ganesh : లక్షలు కట్టాల్సిందే.. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో కొత్త నిబంధనలు
బాలాపూర్ లడ్డూ ప్రతీయేటా రికార్డు స్థాయి ధర పలుకుతుంది. అయితే ఈసారి నిర్వాహకులు కొత్త రూల్ పెట్టారు. గత ఏడాది లడ్డూ ధర ...

Balapur Ganesh
Balapur Ganesh Laddu : తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణపతికి ఎంతటి గుర్తింపు ఉందో.. గణేశ్ లడ్డూ వేలం పాటలో బాలాపూర్ లడ్డూకు అంతే ప్రత్యేక గుర్తింపు ఉంది. బాలాపూర్ లోని గణేశ్ లడ్డూను దక్కించుకునేందుకు భారీ సంఖ్యలో పోటీ పడుతుంటారు. గణేశ్ నవరాత్రుల్లో చివరి రోజు అయిన 11వ రోజున నిమజ్జనానికి ముందు లడ్డూ వేలాన్ని నిర్వహిస్తారు. 2023లో రికార్డు సృష్టిస్తూ ఏకంగా రూ.27లక్షలకు లడ్డూ ధర పలికింది. అయితే, ఈ సారి లడ్డూ వేలంలో నిర్వాహకులు కొత్త రూల్స్ పెట్టారు. లడ్డూ వేలంలో పాల్గొనాలంటే ముందుకు లక్షల్లో డిపాజిట్ చేయాల్సిందే.
Also Read : PM Modi : ప్రధాని మోదీ నివాసంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్.. ఏం పేరు పెట్టారో తెలుసా..? వీడియో వైరల్
బాలాపూర్ లడ్డూ ప్రతీయేటా రికార్డు స్థాయి ధర పలుకుతుంది. అయితే ఈసారి నిర్వాహకులు కొత్త రూల్ పెట్టారు. గత ఏడాది లడ్డూ ధర రూ. 27లక్షలు పలకగా.. ప్రస్తుతం వేలం పాటలో పాల్గొనేవారు రూ.27లక్షలు ముందుగా డిపాజిట్ చేయాలని, అలా అయితేనే వేలంలో పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని నిర్వాహకులు రూల్ పెట్టారు. ప్రతీయేటా లడ్డూకోసం వందల సంఖ్యలో పోటీ పడేవారు. అయితే, ఈసారి వేలం పాటలో కొత్త రూల్ తేవడంతో.. ముందుగా రూ. 27లక్షలు డిపాజిట్ చేసి ఎంత మంది వేలం పాటలో పాల్గొంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రతీయేటా బాలాపూర్ గణపతి కొత్తకొత్త రూపాల్లో దర్శనమిస్తారు. ఈసారి అయోధ్య సెట్ లో బాలాపూర్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు.