అయ్యో ఇలా చేశావేంటి పోలీసన్న.. రోలెక్స్ వాచ్‌కోసం పెద్ద ప్లానేశాడు.. కానీ, చివరిలో బిగ్ ట్విస్ట్..
Rolex watch constable Arrested : రోలెక్స్ వాచ్ దొంగిలించిన కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసిన ఫిల్మ్ నగర్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
- Harishth Thanniru
- Published On : November 29, 2025 / 02:55 PM IST
Rolex watch
Rolex watch constable Arrested : హైదరాబాద్ ఏరియాలో ఇటీవల తాను ఐపీఎస్ అధికారినంటూ శశికాంత్ అనే వ్యక్తి కొన్నిరోజులుగా హల్‌చల్ చేశాడు. అతను నకిలీ అధికారి అని గుర్తించి.. అదుపులోకి తీసుకునేందుకు ఫిల్మ్ నగర్ పోలీసులు అతని ఇంటికెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకొనే క్రమంలో శ్రీరాములు శరణ్ కుమార్ అనే పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారిపోయాడు. ఇంట్లోని రోలెక్స్ వాచీపై కానిస్టేబుల్ కళ్లు పడటంతో దాన్ని ఎలాగైనా దొంగిలించాలని అనుకున్నాడు.
నకిలీ అధికారిని అరెస్టు క్రమాన్ని శ్రీరాములు వీడియో తీశాడు. ఆ సమయంలో వీడియోలో అతను కనిపించకుండా రోలెక్స్ వాచ్‌ను తీసుకొని జేబులో వేసుకున్నాడు. దాని విలువ సుమారు రూ.25లక్షలు ఉంటుంది.
రోలెక్స్ వాచ్ కనిపించడం లేదని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ విషయం కాస్త వైరల్ కావడంతో పోలీసులు రోలెక్స్ వాచ్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేయగా.. రోలెక్స్ వాచ్ దొంగిలించింది కానిస్టేబుల్ శ్రీరాములు అని తేలింది.
Also Read: పోలీస్ వాహనంపై యువకుడి శవపేటిక.. సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఫొటో వెనుక జరిగిన కథ…
నకిలీ ఐపీఎస్ ను అరెస్టు చేస్తున్న క్రమంలో కానిస్టేబుల్ శ్రీరాములు వీడియో తీశాడు. ఆ వీడియోలో తాను కనిపించకుండా జాగ్రత్తపడుతూ రోలెక్స్ వాచ్‌ను తన జేబులో వేసుకున్నాడు. అయితే, నకిలీ ఐపీఎస్ అరెస్టు సమయంలో మరో కానిస్టేబుల్ సైతం వీడియో తీశాడు. ఆ వీడియోలో శ్రీరాములు రోలెక్స్ వాచ్ దొంగిలించినట్లు రికార్డు అయింది. దీంతో శ్రీరాములు దొంగతనం చేసినట్లు తేలింది.
రోలెక్స్ వాచ్ దొంగిలించిన కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసిన ఫిల్మ్ నగర్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని ఇంట్లో ఉంచిన రోలెక్స్ వాచ్ సీజ్ చేశారు. కానిస్టేబుల్ శ్రీరాములు శరణ్ కుమార్ పై సెక్షన్ 316(5) ప్రకారం కేసు నమోదు చేసి.. అతన్ని అరెస్టు చేశారు. కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.
