Hyderabad
Hyderabad : హైదరాబాద్‌లో పోలీసు జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతోంది. సినిమాటిక్‌గా తీసిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.
పోలీసులంటే ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు.. అనుకుంటాం. విధి నిర్వహణలో ఉండే వారు వ్యక్తిగత జీవితంపై అంత శ్రద్ధ పెట్టరు అని కూడా కొందరు అపోహ పడతారు. వాళ్లకు సమయం.. సందర్భం వస్తే సరదాగా ఉంటారని ఓ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఓ పోలీసు జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ సినిమాని తలపించింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు జంట విడివిడిగా పోలీసు వాహనాల నుంచి దిగడంతో వీడియో మొదలవుతుంది. ఆ తరువాత ఈ జంట చార్మినార్, లాడ్ బజార్ దగ్గర జంటగా కనిపించారు. స్లో-మోషన్ షాట్‌లు, డ్యాన్స్ సీక్వెన్స్‌లతో చాలా సినిమాటిక్‌గా తీసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. పోలీసుల మానవీయ కోణాన్ని కొందరు మెచ్చుకోగా, పోలీసు వాహనాలను తమ వ్యక్తిగత వీడియోల కోసం ఎలా వాడుకుంటారని కొందరు ప్రశ్నించారు. ఓ వినియోగదారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ ‘సార్ ఇది ఏమిటి? ప్రీ వెడ్డింగ్ షూట్ లకు పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయా?’ అంటూ ప్రశ్నించాడు.
ఇక ఈ వీడియోపై హైదరాబాద్ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం పోలీసు జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
A pre-wedding shoot of a #PoliceCouple, at the premises of Punjagutta police station in #Hyderabad.
The pre-wedding video song had a sequence which shows the duo entering the police station premises wearing police uniforms and in police vehicles.#PreWeddingShoot pic.twitter.com/SEMRTLXxBs
— Surya Reddy (@jsuryareddy) September 16, 2023